RBI: తగ్గనున్న ఈఎంఐల భారం..
ABN, Publish Date - Jun 07 , 2025 | 08:41 AM
ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తమ రెపో ఆధారిత వడ్డీ రేట్లు (ఆర్‌బీఎల్‌ఆర్) 0.50 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ వెల్లడించింది.
ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తమ రెపో ఆధారిత వడ్డీ రేట్లు (ఆర్‌బీఎల్‌ఆర్) 0.50 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ వెల్లడించింది. తాజా రేట్ల తగ్గింపుతో గృహ రుణాలు 7.45 శాతం నుంచి ప్రారంభం కానుండగా వాహన రుణాలు 7.8 శాతం నుంచి మొదలవుతాయని పీఎన్‌బీ తెలిపింది. కాగా బీఓఐ కూడా తన ఆర్‌బీఎల్‌ఆర్‌ను 8.85 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించినట్లు వెల్లడించింది.
ఎంత తగ్గొచ్చు: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆర్‌బీఐ కీలక రెపో రేటును ఒక శాతం తగ్గించింది. ఇందులో అర శాతాన్ని ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ నెలల్లో, మిగతా అర శాతాన్ని శుక్రవారం తగ్గించింది. దీంతో రెపో ఆధారిత గృహ రుణాల వడ్డీ రేట్లు దిగొస్తున్నాయి. అయితే ఈ వడ్డీ రేట్ల కోతతో ఎవరికి ఎంత భారం తగ్గుతుందనేది ఆయా వ్యక్తుల రుణ కాలపరిమితి, ఈఎంఐలపై ఆధారపడి ఉంటుంది. ఒకే కాలపరిమితితో కేవలం ఈఎంఐ మాత్రమే తగ్గించుకుంటే ఒక రకంగా, అదే ఈఎంఐతో కాలపరిమితి మాత్రమే తగ్గించుకుంటే వడ్డీ భారం తగ్గుతుంది.
ఈఎంఐ మాత్రమే తగ్గించుకుంటే: 20 ఏళ్ల కాలపరిమితితో ఒక వ్యక్తి 9.5 శాతం వడ్డీతో గృహ రుణం తీసుకుంటే, ఇప్పుడు అతను చెల్లించే వడ్డీ రేటు 8.5 శాతం. అదే కాలపరిమితితో ఈఎంఐ మాత్రమే తగ్గించుకుంటే అతడికి నెలకు అదా అయ్యే ఈఎంఐ రూ.1,929. అంటే 20 ఏళ్ల కాలంలో అతడికి ఆదా అయ్యే వడ్డీ రూ.4,63 లక్షలు.
Also Read:
కన్నప్ప సినిమాకు బ్రాహ్మణ సంఘాల వార్నింగ్
For More Business News and Telugu News..
Updated Date - Jun 07 , 2025 | 11:04 AM