భారత విమానాలపై పాక్ నిషేధంతో ఏఐపై రూ.5,000 కోట్ల భారం
ABN, Publish Date - May 02 , 2025 | 02:45 AM
భారత విమానాలు తన గగనతలం నుంచి ప్రయాణించకుండా పాకిస్థాన్ విధించిన నిషేధం భారత విమానయానంపై పెద్ద భారమే మోపుతోంది. ఒక్క ఎయిర్ ఇండియా (ఏఐ)పైనే...
న్యూఢిల్లీ: భారత విమానాలు తన గగనతలం నుంచి ప్రయాణించకుండా పాకిస్థాన్ విధించిన నిషేధం భారత విమానయానంపై పెద్ద భారమే మోపుతోంది. ఒక్క ఎయిర్ ఇండియా (ఏఐ)పైనే ఈ భారం ఏడాదికి ఎంత లేదన్నా 60 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,070 కోట్లు) వరకు ఉంటుందని అంచనా. కంపెనీ రాసిన ఒక లేఖను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ ఈ మేరకు ఒక కథనం ప్రచురించింది. ఈ నిషేధంతో ఢిల్లీ నుంచి యూరప్, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే భారత విమానాలు ఇక గుజరాత్, ఇరాన్ మీదుగా ప్రయాణించాలి. ఇందుకు ఎంత లేదన్నా ఒక్కో విమానానికి గంట అధిక సమయం, దాదాపు 10 టన్నుల అదనపు ఇంధనం ఖర్చవుతాయని అంచనా. అమెరికా, కెనడా, యూరప్ దేశాలకు ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి రోజూ కనీసం 35 విమాన సర్వీసులు నడుపుతోంది.
ఇవి కూడా చదవండి
Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..
Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు
Updated Date - May 02 , 2025 | 02:45 AM