Share News

Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..

ABN , Publish Date - May 01 , 2025 | 08:57 PM

Rajgarh Viral Video: అయితే, హిందువులకు ఎంతో పవిత్రమైన అక్షయం తృతీయనాడు ఎలాగైనా పెళ్లి జరిపించి తీరాలని ఆధిత్య తల్లిదండ్రులు భావించారు. ఇదే విషయాన్ని డాక్టర్‌కు చెప్పారు. నందిని ఎక్కువ సేపు కూర్చుని ఉండటం మంచిది కాదని డాక్టర్లు స్పష్టం చేశారు.

Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..
Rajgarh Viral Video

కక్కు వచ్చినా.. కల్యాణం వచ్చినా ఆగదు అంటారు. అది ఈ పెళ్లి విషయంలో నిజమైంది. పెళ్లికి కొన్ని రోజుల ముందు అనుకోని సంఘటన జరిగింది. పెళ్లి కూతురు ఆస్పత్రి పాలైంది. అయితే, పెళ్లి ఆపడానికి పెళ్లి కొడుకు తల్లి ఒప్పుకోలేదు. ఏకంగా ఆస్పత్రిలోనే పెళ్లి తంతు జరిపించింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌లో చోటుచేసుకుంది. ఆ వింత పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్, రాజ్‌ఘర్ జిల్లా బయోరా టౌన్‌కు చెందిన ఆదిత్య సింగ్‌కు అదే ప్రాంతానికి చెందిన నందిని అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. అక్షయ తృతీయ నాడు మూడు ముళ్లతంతు జరగాల్సి ఉంది.


పెళ్లి దగ్గర పడటంతో రెండు కుటుంబాల వారు ఏర్పాట్లు మొదలెట్టారు. పెళ్లికి ఐదు రోజుల ముందు నందిని ఆరోగ్యం క్షీణించింది. నందిని ఆరోగ్యం దారుణంగా ఉండటంతో బియావర్లోని పంజాబీ నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. ఆమెకు చికిత్స చేసిన డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే, హిందువులకు ఎంతో పవిత్రమైన అక్షయం తృతీయనాడు ఎలాగైనా పెళ్లి జరిపించి తీరాలని ఆధిత్య తల్లిదండ్రులు భావించారు. ఇదే విషయాన్ని డాక్టర్‌కు చెప్పారు. నందిని ఎక్కువ సేపు కూర్చుని ఉండటం మంచిది కాదని డాక్టర్లు అన్నారు.


అక్షయ తృతీయ రోజున పెళ్లి జరగకపోతే.. మరో రెండు సంవత్సరాలు ఆగాల్సి వస్తుందని పెళ్లి కొడుకు తల్లి మమత భావించింది. ఇదే విషయాన్ని పెళ్లి కూతురు తల్లిదండ్రులకు చెప్పింది. ఆస్పత్రిలోనే పెళ్లి చేద్దామని అడిగింది. ఇందుకు వారు ఒప్పుకున్నారు. ఇక, పెళ్లి పనులు షూరూ అయ్యాయి. పెళ్లి రోజు పెళ్లి కొడుకు ఆధిత్య గుర్రం మీద మేళతాళాలతో ఆస్పత్రి దగ్గరకు వచ్చాడు. అగ్ని సాక్షిగా నందిని మెడలో తాళి కట్టాడు. తాళి కట్టే సమయంలో నందిని నిలబడలేకపోయింది. ఓ మహిళ పట్టుకుని నిలబెట్టడంతో ఆధిత్య తాళి కట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు

Ajith: అప్పులు తీర్చడానికి సినిమాల్లోకి వచ్చిన అజిత్

Updated Date - May 01 , 2025 | 09:02 PM