ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ChatGPT Go: చాట్ జీపీటీ బంపర్ ఆఫర్.. రూ. 399కే పెయిడ్ వర్షన్

ABN, Publish Date - Aug 14 , 2025 | 01:58 PM

ChatGPT Go: చాట్ జీపీటీ గో, చాట్ జీపీటీ ప్లస్, చాట్ జీపీటీ ప్రో. చాట్ జీపీటీ ప్లస్ కోసం నెలకు ఏకంగా 2500 రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది. చాట్ జీపీటీ ప్రో కోసం ఏకంగా 25 వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది.

ChatGPT Go

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా చాట్ జీపీటీ ‘అల్లాద్దిన్ అద్భుత దీపం’లా మారిపోయింది. జనాలు చాట్ జీపీటీ మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. అయితే, చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్‌ను కొంత వరకు మాత్రమే వాడుకోగలం. ఫ్రీ వర్షన్‌లో ప్రతీ టాస్క్‌కు లిమిట్ ఉంది. చాట్ జీపీటీ సత్తా ఏంటో చూడాలంటే.. పెయిడ్ వర్షన్ వాడాల్సిందే. చాట్ జీపీటీ పెయిడ్ వర్షన్ మూడు ప్లాన్లలో అందుబాటులో ఉంది.

చాట్ జీపీటీ గో, చాట్ జీపీటీ ప్లస్, చాట్ జీపీటీ ప్రో. చాట్ జీపీటీ ప్లస్ కోసం నెలకు ఏకంగా 2500 రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది. చాట్ జీపీటీ ప్రో కోసం ఏకంగా 25 వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది. చాట్ జీపీటీ ఇండియన్ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ‘చాట్ జీపీటీ గో’ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ను కొత్తగా లిస్టులో కూడా చేర్చింది. కేవలం 399 రూపాయలకే ఫ్రీ వర్షన్ కంటే బెటర్ టాస్కులను చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇండియాలో ధరల టెస్టులో భాగంగా కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది.

చాట్ జీపీటీ గో ఫీచర్స్

చాట్ జీపీటీ గో .. ఫ్రీ ప్లాన్ కంటే కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఫ్రీ ప్లాన్ లాగానే ఇందులో కూడా జీపీటీ 5 ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. మెసేజెస్, అప్‌లోడ్స్ లిమిట్స్ పరిమితి ఫ్రీ ప్లాన్ కంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఫొటోలను జనరేట్ చేసుకోవచ్చు. రీసెర్చ్ విషయంలో మాత్రం లిమిట్ ఉంది. డేటా ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. డెటా అనాలసిస్‌కు కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరలు పెడితే ఇండియాలో ఎక్కువ మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారని ఓపెన్ ఏఐ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్లాన్ల ధరల్ని ఇండియన్ కరెన్సీలో ఉంచుతోంది.

ఇవి కూడా చదవండి

వైసీపీని కుమ్మేసిన కూటమి.. ఒంటిమిట్ట జడ్పీటీసీ టీడీపీ కైవసం

ఇలా కూడా స్మగ్లింగ్ చేస్తారా?.. ఏసీ కోచ్‌లో 150 మందు బాటిళ్లు..

Updated Date - Aug 14 , 2025 | 02:02 PM