ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Digital Payment Fraud Prevention: యూపీఐ పీ2పీ కలెక్ట్‌ రిక్వె్‌స్టలకు స్వస్తి

ABN, Publish Date - Aug 15 , 2025 | 01:54 AM

డిజిటల్‌ మోసాలను అరికట్టేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ)లో పీర్‌ టు పీర్‌...

అక్టోబరు 1 నుంచి అమలు

న్యూఢిల్లీ: డిజిటల్‌ మోసాలను అరికట్టేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ)లో పీర్‌ టు పీర్‌ (పీ2పీ) కలెక్ట్‌ రిక్వె్‌స్టలకు స్వస్తి పలుకుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ అక్టోబరు 1 నుంచి బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (పీఎ్‌సపీ) తో పాటు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి థర్డ్‌ పార్టీ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌లు.. యూపీఐలో పీ2పీ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ లావాదేవీలను అనుమతించరాదని ఎన్‌పీసీఐ నిర్దేశించింది. తమ వ్యవస్థలో తదనుగుణంగా మార్పులు చేసుకోవాలని కోరింది. యూపీఐ వినియోగదారుల్లో ఒకవ్యక్తి మరో వ్యక్తి నుంచి నగదు కోరేందుకు పీ2పీ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ ఫీచర్‌ వీలుకల్పిస్తుంది. ముఖ్యంగా స్నేహితులు లేదా సన్నిహితులు తమ మధ్య తిరిగి చెల్లింపులు లేదా బిల్లు చెల్లింపు భారాన్ని సమంగా పంచుకునేందుకు (స్ల్పిట్టింగ్‌ బిల్స్‌) దీన్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఒక వ్యక్తి పీ2పీ కాల్‌ రిక్వెస్ట్‌ లావాదేవీ ద్వారా మరో వ్యక్తి నుంచి రూ.2,000 వరకు పొందే వీలుంది. రోజులో గరిష్ఠంగా 50 లావాదేవీలు నెరిపేందుకు అనుమతి ఉంది. అయితే, ఈ మార్గంలోనూ డిజిటల్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీసీఐ వీటిని నిలిపివేయాలని నిర్ణయించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 01:54 AM