ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Short Term Market Trend: టెక్‌ వ్యూ ప్రధాన మద్దతు స్థాయి 24000

ABN, Publish Date - Aug 11 , 2025 | 05:10 AM

నిఫ్టీ గత వారం మైనర్‌ రికవరీతో ప్రారంభమైనా తదుపరి నాలుగు రోజులూ బలహీనత ప్రదర్శించింది. కీలక స్థాయి 24,500 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమయించి. చివరికి వారం మొత్తం మీద 202 పాయింట్ల నష్టంతో 24,360 వద్ద ముగిసింది. వరుసగా...

టెక్‌ వ్యూ: ప్రధాన మద్దతు స్థాయి 24000

నిఫ్టీ గత వారం మైనర్‌ రికవరీతో ప్రారంభమైనా తదుపరి నాలుగు రోజులూ బలహీనత ప్రదర్శించింది. కీలక స్థాయి 24,500 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమయించి. చివరికి వారం మొత్తం మీద 202 పాయింట్ల నష్టంతో 24,360 వద్ద ముగిసింది. వరుసగా ఆరు వారాల డౌన్‌ట్రెండ్‌లో మార్కెట్‌ 1200 పాయింట్లు నష్టపోయి ఇప్పుడు కీలక స్వల్పకాలిక మద్దతు స్థాయి 24,000 సమీపంలోకి వచ్చింది. మిడ్‌క్యాప్‌-100, స్మాల్‌క్యాప్‌-100 సూచీలు కూడా తీవ్ర నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ గత వారంలో 24,500 కన్నా దిగజారినందు వల్ల టెక్నికల్‌గా పుల్‌బ్యాక్‌ అవకాశం ఉంది. బలమైన బౌన్స్‌బ్యాక్‌ ఏర్పడితే తప్ప మరింత బలహీనతను కొనసాగించే అవకాశాలే ఉన్నాయి.

బుల్లిష్‌ స్థాయిలు: స్వల్పకాలిక పాజిటివ్‌ ట్రెండ్‌ ప్రదర్శించాలంటే మార్కెట్‌ ప్రస్తుత స్థాయిల్లో పునరుజ్జీవం సాధించి 24,500 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 24700, 25000.

బేరిష్‌ స్థాయిలు: ప్రస్తుత మద్దతు స్థాయి 24300 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే మరింత బలహీనపడుతుంది. దిగువన మద్దతు స్థాయిలు 24150, 24000. ఈ 24000 కీలక స్వల్పకాలిక మద్దతు స్థాయి కావడం వల్ల ఇక్కడ కన్సాలిడేషన్‌ ఉండవచ్చు. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఈ స్థాయిలో నిలదొక్కుకుని బలంగా క్లోజ్‌ కావాలి.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 610 పాయింట్ల మేరకు నష్టపోయి 55,000 సమీపంలో మూడు నెలల కనిష్ఠ స్థాయిలో క్లోజయింది. సానుకూలత కోసం ఈ స్థాయిలో బలంగా క్లోజ్‌ కావాలి. ప్రధాన నిరోధ స్థాయి 55,600 కన్నా పైన నిలదొక్కుకుంటే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌కు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత స్థాయిలో విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది.

పాటర్న్‌: నిఫ్టీ గత వారం ప్రధానమైన 100 డిఎంఏ కన్నా స్వల్పంగా దిగువకు వచ్చింది. 200 డిఎంఏ 24,000 వద్ద ఉంది. అలాగే మార్కెట్‌ ప్రస్తుతం 24,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద ఉంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ తప్పనిసరిగా బౌన్స్‌బ్యాక్‌ కావాలి. మార్కెట్‌ గత వారం మేజర్‌ బాటమ్‌ 24,500 వద్ద బ్రేక్‌డౌన్‌ సాధించింది.

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24460, 24500

మద్దతు : 24300, 24230

వి. సుందర్‌ రాజా

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:10 AM