టెక్ వ్యూ : 24,500 పైన నిలకడ తప్పనిసరి
ABN, Publish Date - May 05 , 2025 | 05:33 AM
నిఫ్టీ ఎట్టకేలకు గత వారం కీలక స్థాయి 24,500 దాటి మరింత పురోగమించినా శుక్రవారంనాడు గరిష్ఠ స్థాయిల్లో ఇంట్రాడే కరెక్షన్‌తో అప్రమత్త సంకేతం ఇచ్చింది. వారం మొత్తానికి 310 పాయింట్ల లాభంతో...
టెక్ వ్యూ : 24,500 పైన నిలకడ తప్పనిసరి
నిఫ్టీ ఎట్టకేలకు గత వారం కీలక స్థాయి 24,500 దాటి మరింత పురోగమించినా శుక్రవారంనాడు గరిష్ఠ స్థాయిల్లో ఇంట్రాడే కరెక్షన్‌తో అప్రమత్త సంకేతం ఇచ్చింది. వారం మొత్తానికి 310 పాయింట్ల లాభంతో 24,350 వద్ద ముగిసింది. 24,500 వద్ద కన్సాలిడేషన్, సైడ్‌వేస్ ధోరణిని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం గత డిసెంబరు నాటి గరిష్ఠ స్థాయిలకు చేరువలో ఉంది. నిఫ్టీ వరుసగా గత 15 రోజులుగా నిరంతర ర్యాలీలో ఉన్నందు వల్ల కరెక్షన్ ఏర్పడవలసిన అవసరం ఉంది. అమెరికన్ మార్కెట్లలో గత శుక్రవారం నాటి ర్యాలీ కారణంగా ఈ వారం పాజిటివ్‌గానే ప్రారంభం కావచ్చు. ఈ క్రమంలో మరోసారి 24,500 వద్ద పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడయితే అప్‌ట్రెండ్ కోసం కీలక స్థాయి 24,500 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. మరో నిరోధం 24,800. ప్రధాన నిరోధం 25,000. ఇక్కడ కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది.
బేరిష్ స్థాయిలు: 24,500 వద్ద విఫలమైతే బలహీనత ముప్పును ఎదుర్కొంటుంది. దిగువన మద్దతు స్థాయి 24,300. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. దిగువ మద్దతు స్థాయిలు 23,150, 23,000.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారంలో సైడ్‌వే్‌సలో కదలాడుతూ 450 పాయింట్ల లాభంతో వారం మధ్య స్థాయి 55,100 వద్ద ముగిసింది. ఎగువన నిరోధ స్థాయిలు 55,600, 56,000. మరింత సానుకూలత కోసం 56,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మద్దతు స్థాయి 55,000. ఇక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమైతే అప్రమత్త సంకేతం ఇస్తుంది.
పాటర్న్: మార్కెట్ గత వారం 200 డిఎంఏ కన్నా పైన ముగిసింది. పుల్‌బ్యాక్ రియాక్షన్ ఏర్పడి ఈ స్థాయిలో నిలదొక్కుకోలేకపోతే అప్రమత్త సంకేతం ఇస్తుంది. ట్రెండ్‌లో మరింత సానుకూలత కోసం 24,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్ ఉంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,500, 24,560
మద్దతు : 24,360, 24,300
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి:
పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News
Updated Date - May 05 , 2025 | 05:34 AM