Nifty Market Outlook: మార్కెట్లు పైకా కిందకా
ABN, Publish Date - Aug 11 , 2025 | 05:13 AM
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ వారం అత్యంత కీలకంగా మారనుంది. కొన్నేళ్ల తర్వాత నిఫ్టీ వరుసగా ఐదు వారాలు నెగిటివ్‌గా ముగిసింది. ఏదేమైనా నిర్ణయాత్మక గమనం వైపు సంకేతాలు వస్తే మంచి ర్యాలీకి అవకాశం ఉంటుంది. దాదాపుగా...
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ వారం అత్యంత కీలకంగా మారనుంది. కొన్నేళ్ల తర్వాత నిఫ్టీ వరుసగా ఐదు వారాలు నెగిటివ్‌గా ముగిసింది. ఏదేమైనా నిర్ణయాత్మక గమనం వైపు సంకేతాలు వస్తే మంచి ర్యాలీకి అవకాశం ఉంటుంది. దాదాపుగా 15 సెషన్ల తర్వాత ఎఫ్‌ఐఐలు గత శుక్రవారం రూ.1,932 కోట్ల నిధులు ఇన్వెస్ట్ చేయడం సానుకూలాంశం. గత వారం మీడియా, పీఎ్‌సయూ బ్యాంక్, మెటల్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.
స్టాక్ రికమెండేషన్స్
ఎల్‌ఐసీ: ప్రస్తుతం ఈ షేర్లు కీలక శ్రేణి రూ.900 పరిధిలో కదలాడుతున్నాయి. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతోంది. తాజా ఫలితాలు బాగుండడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం 3.2ు లాభంతో రూ. 912 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.1050 టార్గెట్ ధరతో రూ.900 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. రూ. 875 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
బీపీసీఎల్: నెల రోజులుగా ఈ షేర్లు డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్నా.. రిలెటివ్ స్ట్రెంత్ మాత్రం పెరుగుతోంది. షార్ట్ టర్మ్ మూమెంటమ్ క్రమంగా పుంజుకుంటోంది. చివరి ఐదు సెషన్ల సగటుతో పోలిస్తే వాల్యూమ్ పెరిగింది. గత శుక్రవారం రూ.319 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.370/390 టార్గెట్ ధరతో రూ.300 శ్రేణిలో ప్రవేశింవచ్చు. రూ.285 స్టాప్‌లా్‌సగా పరిగణించాలి.
టైటాన్: రెండేళ్లుగా ఈ షేర్లు పరిమిత పరిధిలోనే కదలాడుతూ. సైడ్‌వే్‌సలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండడం, పండుగల సీజన్ మొదలవడంతోఈ షేరు పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. స్వల్పకాల వ్యవధిలో అప్‌స్వింగ్ నమోదయ్యేలా కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.3460 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.3650/3700 టార్గెట్ ధరతో రూ. 3400 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. రూ.3360 గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
పిడిలైట్ ఇండస్ట్రీస్: మార్చిలో చక్కని అప్‌స్వింగ్ తర్వాత ఈ షేర్లు కన్సాలిడేట్ అయ్యాయి. తాజా కరెక్షన్ తర్వాత మూమెంటమ్ ప్రదర్శిస్తున్నాయి. రిలెటివ్ స్ట్రెంత్ బాగుంది. క్రితం వారం డెలివరీ వాల్యూమ్ గణనీయంగా పుంజుకుంది. గత శుక్రవారం రూ. 3081 వద్ద ముగిసిన ఈ షేరును మదుపరులు రూ.3300 టార్గెట్ ధరతో రూ. 3000పై స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. గట్టి స్టాప్‌లాస్ రూ.2960.
హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్: ఈ ఏడాది మార్చి నుంచి మొదలైన బుల్‌రన్ ప్రస్తుతం నెమ్మదించింది. సరికొత్త అప్‌ట్రెండ్‌కు అవసరమైన దిద్దుబాటు జరిగింది. పైగా ఈ షేర్ల రిలెటివ్ స్ట్రెంత్, మూమెంటమ్ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ. 761 వద్ద ముగిసింది. రూ. 880 టార్గెట్ ధరతో రూ. 750 వద్ద ఇన్వెస్ట్ చేయవచ్చు. రూ.725 వద్ద స్టాప్‌లాస్ తప్పనిసరి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News
Updated Date - Aug 11 , 2025 | 05:13 AM