ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Motor Insurance Premium: వాహన బీమా మరింత భారం..?

ABN, Publish Date - Jun 07 , 2025 | 09:02 AM

మోటార్‌ ఇన్సూరెన్స్‌ ముఖ్యంగా థర్డ్‌ పార్టీ (టీపీ) ఇన్సూరెన్స్‌ ప్రీమియం భారీగా పెరగనుంది. ఈ ప్రీమియంను 18 నుంచి 25 శాతం పెంచాలని బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఇప్పటికే సిఫారసు చేసింది. రోడ్డు రవాణ, రహదారులు మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలిస్తోంది.

Motor Insurance Premium

న్యూఢిల్లీ: మోటార్‌ ఇన్సూరెన్స్‌ ముఖ్యంగా థర్డ్‌ పార్టీ (టీపీ) ఇన్సూరెన్స్‌ ప్రీమియం భారీగా పెరగనుంది. ఈ ప్రీమియంను 18 నుంచి 25 శాతం పెంచాలని బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఇప్పటికే సిఫారసు చేసింది. రోడ్డు రవాణ, రహదారులు మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలిస్తోంది. వచ్చే రెండు మూడు వారాల్లో ప్రభుత్వం ఈ సిఫారసులపై నిరయం తీసుకుంటుందని సమాచారం. 2022 తర్వాత థర్డ్‌ పార్టీ మోటార్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం పెంచలేదు. దీంతో వచ్చే ప్రీమియం కంటే క్లెయిమ్స్‌పై చేసే చెల్లింపులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ రంగంలోని న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన ప్రీమియం కంటే 8 శాతం అధికంగా టీపీ చెల్లింపులు చేసింది. ప్రైవేట్‌ రంగంలోని గో డిజిట్‌, ఐసీఐసీఐ లొంబార్డ్‌ సంస్థల టీపీ చెల్లింపులూ 64.2 శాతం నుంచి 69 శాతం వరకు ఉన్నాయి. టీపీ ప్రీమియం రేట్లు పెంచితే తప్ప ఈ భారం మోయడం తమ వల్ల కాదని బీమా కంపెనీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. దీంతో త్వరలోనే మోటార్‌ ఇన్సూరెన్స్‌ థర్డ్‌ పార్టీ ప్రీమియాలు మరింత భారంగా మారనున్నాయి.


Also Read:

రూ.2.5 లక్షలు పలికిన మేకపోతు

వడ్డీ రేట్లు తగ్గించిన పీఎన్‌బీ, బీఓఐ

For More Business News and Telugu News..

Updated Date - Jun 07 , 2025 | 09:02 AM