రూ.250తో నెలవారీ ‘సిప్’
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:45 AM
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ (ఎస్‌బీఐ ఎంఎఫ్) మరింత సులభతరం చేసింది. తన ‘జననివేశ్ సిప్’ పథకం కింద మదుపరులు నెలనెలా క్రమానుగత...
జననివేశ్ పథకం కింద ప్రారంభం .. ఎస్‌బీఐ ఎంఎఫ్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ (ఎస్‌బీఐ ఎంఎఫ్) మరింత సులభతరం చేసింది. తన ‘జననివేశ్ సిప్’ పథకం కింద మదుపరులు నెలనెలా క్రమానుగత పెట్టుబడుల పథకం (సిప్)లో పెట్టే కనీస పెట్టుబడి పరిమితిని రూ.250కు కుదించింది. సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ సమక్షంలో ఎస్‌బీఐ ఎంఎఫ్ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎస్‌బీఐ యోనో యాప్‌తో పాటు పేటీఎం, జీరోధా, గ్రో వంటి ఫిన్‌టెక్ కంపెనీల ద్వారానూ మదుపరులు ఈ సిప్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ సిప్ పెట్టుబడుల కోసం బ్యాంకు ద్వారా చేసే చెల్లింపులను ఎస్‌బీఐ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది.
సిప్ ద్వారా ఎంఎఫ్ పథకాల్లో తొలిసారిగా మదుపు చేసే మదుపరులు, చిన్న పొదుపరులు, అసంఘటిత రంగంలోని మదుపరులను దృష్టిలో ఉంచుకుని ఈ రూ.250 సిప్ పథకం ప్రారంభించాం’ అని ఎస్‌బీఐ ఎంఎఫ్ ఎండీ, సీఈఓ నంద కిశోర్ చెప్పారు. ఆర్థిక అభివృద్ధిలో వినూతనత్వం, సమ్మిళితం కూడా కీలకం. అందులో భాగంగానే ఈ పథకం తీసుకొచ్చాం’ అని ఎస్‌బీఐ చైర్మన్ సీ శ్రీనివాసులు శెట్టి తెలిపారు.
భేషైన పథకం :సెబీ చీఫ్
‘సిప్’ ద్వారా ఎస్‌బీఐ ఎంఎఫ్ పథకాల్లో పెట్టే కనీస పెట్టుబడిని రూ.250కి తగ్గించడంపై కార్యక్రమంలో పాల్గొన్న సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన చిరకాల కల అన్నారు. అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు గిట్టుబాటు కాదని వదిలేసిన ఈ ప్రతిపాదనను ఎస్‌బీఐ ఎంఎఫ్ ప్రారంభించాడాన్ని ఆమె అభినందించారు.
ఇవి కూడా చదవండి:
Viral News: పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ.. ఫైన్ విధించిన కోర్టు, పదవి కూడా..
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 18 , 2025 | 01:46 AM