ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మిశ్రమంగా కదలాడే అవకాశం

ABN, Publish Date - May 05 , 2025 | 05:36 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 24,346 స్థాయిలో కన్సాలిడేట్‌ అవుతోంది. 24,550 స్థాయిలో బలమైన నిరోధాన్ని ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమిస్తే...

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 24,346 స్థాయిలో కన్సాలిడేట్‌ అవుతోంది. 24,550 స్థాయిలో బలమైన నిరోధాన్ని ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమిస్తే మీడియం టర్మ్‌లో మరింత బలపడే అవకాశం ఉంది. మిడ్‌, స్మాల్‌ కంపెనీల్లో ఇప్పటికీ కరెక్షన్‌ కొనసాగుతుండటం మొత్తంగా మార్కెట్‌ బలహీనతను సూచిస్తోంది. ప్రస్తుతం రిఫైనరీ, షిప్‌బిల్డింగ్‌, టెక్స్‌టైల్స్‌, రక్షణ రంగ షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది.


స్టాక్‌ రికమండేషన్స్‌

తేజస్‌ నెట్‌వర్క్‌: రెండేళ్లుగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ప్రస్తుతం అక్యుములేషన్‌ జోన్‌లో ఉంది. మార్చి నుంచి బేస్‌ ఏర్పడుతోంది. కీలకమైన రూ.650 స్థాయిలో రెండోసారి మద్దతు తీసుకున్నాయి. గత శుక్రవారం రూ.704 స్థాయిలో ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.700 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.810 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.670 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

రైల్‌టెల్‌: గత ఆరు నెలల్లో 25 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరులో రూ.290 స్థాయిలో మంచి బేస్‌ ఏర్పడుతోంది. ఇక్కడ మంచి డిమాండ్‌ కనిపిస్తోంది. 20,50 రోజుల మూవింగ్‌ యావరేజే్‌సను అధిగమించింది. గత శుక్రవారం 6.7 శాతం లాభంతో రూ.316 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.300 శ్రేణిలో ప్రవేశించి రూ.370 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.275 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్‌బీఐ కార్డ్స్‌: స్వలకాలికంగా చూస్తే ఈ కౌంటర్‌లో మూమెంటమ్‌ కాస్త తగ్గింది. అయితే మీడియం టర్మ్‌లో బలాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా కీలకమైన రూ.860 స్థాయికి చేరుకుంది. గత శుక్రవారం రూ.878 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.850 పై స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.980 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.835 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

హిందాల్కో: ఏడాది కాలంగా అంతగా పనితీరు కనబరచని ఈ షేరు ప్రస్తుతం కీలకమైన డిమాండ్‌ జోన్‌లోకి వచ్చింది. రూ.600 పై స్థాయిలో టైట్‌ ప్రైస్‌ యాక్షన్‌తో చలిస్తోంది. మీడియం టర్మ్‌ మూమెంటమ్‌ బాగుంది. గత శుక్రవారం రూ.632 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.600 శ్రేణిలో ప్రవేశించి రూ.740 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.675 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


ఎస్‌బీఐ: ప్రస్తుతం ఈ షేరు మంచి మూమెంటమ్‌, బలాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా మూడు నెలల గరిష్ఠాన్ని అధిగమించిన ఈ షేరు 20 రోజుల మూవింగ్‌ యావరేజెస్‌ పైన నిలదొక్కుకుంది. గత శుక్రవారం రూ.800 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.780 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.860 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.755 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

- మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్

ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..

వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్

Read More Business News and Latest Telugu News

Updated Date - May 05 , 2025 | 05:36 AM