ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లకు తొలకరి పులకరింత

ABN, Publish Date - May 27 , 2025 | 02:59 AM

రుతుపవనాలు అంచనాల కన్నా ముందుగా ప్రవేశించిన ఉత్సాహంలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారం రోజుల గరిష్ఠ స్థాయికి దూసుకుపోయాయి. కేంద్రానికి ఆర్‌బీఐ రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌...

మార్కెట్లకు తొలకరి పులకరింత

25,000 పైన నిఫ్టీ

ముంబై: రుతుపవనాలు అంచనాల కన్నా ముందుగా ప్రవేశించిన ఉత్సాహంలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారం రోజుల గరిష్ఠ స్థాయికి దూసుకుపోయాయి. కేంద్రానికి ఆర్‌బీఐ రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ పంచడం, భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని నీతి ఆయోగ్‌ ప్రకటించడం, ఈయూపై 50 శాతం సుంకాల అమలును ట్రంప్‌ జూలై 9కి వాయిదా వేయడం ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. మదుపరులు ఆటో, ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెంచడంతో సెన్సెక్స్‌ 455.37 పాయింట్ల లాభంతో 82,176.45 వద్ద ముగిసింది. ఒకదశలో సూచీ 771 పాయింట్లకు పైగా ఎగిసి 82,492 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 148 పాయింట్లు పెరిగి 25,001.15 వద్ద స్థిరపడింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.444.79 లక్షల కోట్లకు చేరింది.

  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 35 పైసలు బలపడి రూ.85.10 వద్ద ముగిసింది.

  • ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.550 పెరిగి రూ.99,300కు చేరగా.. కిలో వెండి రూ.1,170 పెరుగుదలతో రూ.1,00,370కి ఎగబాకింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒకదశలో 25 డాలర్లు పెరిగి 3,332 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.


గ్రో ఐపీఓ.. రూ.8,500 కోట్ల వరకు సమీకరణ

ఆన్‌లైన్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘గ్రో’ మాతృసంస్థ బిలియన్‌బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు(డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓ ద్వారా కంపెనీ 70-100 కోట్ల డాలర్ల (రూ.5,950-8,500 కోట్లు) స్థాయిలో నిధులు సమీకరించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.


టాటా కాపర్+...

శతాబ్దాల నాటి భారతీయ సంప్రదాయమైన రాగి పాత్రల్లో నీరు తాగే అలవాటును తిరిగి పరిచయం చేస్తూ టాటా కాపర్+ ఇప్పుడు టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త ప్రచారంతో ఆకట్టుకుంటోంది. వారసత్వం, ఆరోగ్యం, నేటి తరం వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వినూత్న డ్రింక్‌‌ని రూపొందించామని సంస్థ చెబుతోంది. ఇది రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేసి తాగే భారతీయ ప్రాచీన పద్ధతుల నుంచి స్ఫూర్తి పొందింది. ఈ ప్రచార చిత్రం ఒక రైలు ప్రయాణంలో సాగే సున్నితమైన కథను ఆవిష్కరిస్తుంది.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 10:07 PM