Mumbai stock exchange: మళ్లీ లాభాల్లోకి మార్కెట్లు
ABN, Publish Date - Jul 22 , 2025 | 04:44 AM
గత వారాంతంలో వరుసగా రెండు రోజులు నష్టాలు చవిచూసిన దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం మళ్లీ లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 442.61 పాయింట్ల వృద్ధితో...
సెన్సెక్స్ 442 పాయింట్లు అప్
ముంబై: గత వారాంతంలో వరుసగా రెండు రోజులు నష్టాలు చవిచూసిన దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం మళ్లీ లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 442.61 పాయింట్ల వృద్ధితో 82,200.34 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 122.30 పాయింట్ల లాభంతో 25,090.70 వద్ద ముగిసింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు చేపట్టడం ఇందుకు దోహదపడింది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో అమ్మకాలు సూచీల లాభాలను పరిమితం చేశాయి.
బ్రిగేడ్ హోటల్ ఐపీఓ ధరల శ్రేణి రూ.85-90: బెంగళూరుకు చెందిన రియల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజె్‌సకు చెందిన ఆతిథ్య సేవల అనుబంధ విభాగమైన బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్ రూ.760 కోట్ల ఐపీఓ ఈ నెల 24న ప్రారంభమై 28న ముగియనుంది. పబ్లిక్ ఇష్యూ ధరల శ్రేణిని రూ.85-90గా నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 22 , 2025 | 04:44 AM