Stock Market: అప్రమత్తంగా ఉండటం బెటర్
ABN, Publish Date - Jun 23 , 2025 | 03:47 AM
ఈ వారం ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తతో వ్యవహరించటం మంచిది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా చేరిపోవటంతో ఇరాన్ మద్దతు దేశాలు జోక్యం చేసుకునే పరిస్థితులు నెలకొనాన్నయి.
ఈ వారం ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తతో వ్యవహరించటం మంచిది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా చేరిపోవటంతో ఇరాన్ మద్దతు దేశాలు జోక్యం చేసుకునే పరిస్థితులు నెలకొనాన్నయి. ఇది ప్రపంచ మార్కెట్లలో అస్థిరతకు దారి తీసే అవకాశం ఉంది. దీంతో సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. ట్రంప్ ప్రకటించిన 90 రోజుల టారిఫ్ ఉపశమనం గడువు సమీపిస్తుండటంతో ఫార్మా, మెటల్, ఎనర్జీ షేర్లపై ఒత్తిడి కనిపిస్తోంది.
స్టాక్ రికమండేషన్స్
భారత్ ఎలక్ట్రానిక్స్: ఈ షేరు జీవితకాల గరిష్ఠం వద్ద ట్రేడవుతోంది. కొన్ని రోజులుగా మూమెంటమ్ బాగుంది. వాల్యూమ్ గణనీయంగా పెరుగుతోంది. కొత్త ఆర్డర్లు వస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత శుక్రవారం 2.4 శాతం లాభంతో రూ.408 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.400 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.445/480 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.365 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఇండస్ టవర్: ఈ షేరుకు చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ కాల వ్యవధుల్లో నిఫ్టీ రిటర్న్స్‌ను క్రమంగా అధిగమిస్తోంది. ప్రస్తుతం ఈ షేరు చక్కని రిస్క్ రివార్డు రేషియోతో అందుబాటులో ఉంది. గత శుక్రవారం 3.76 శాతం లాభంతో రూ.400 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.380/390 శ్రేణిలో ప్రవేశించి రూ.470 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.360 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
సీడీఎస్ఎల్: తాజా బ్రేకౌట్ తర్వాత ఈ షేరు పుల్‌బ్యాక్ అయ్యింది. ప్రస్తుతం కన్సాలిడేషన్ కొనసాగుతోంది. నిఫ్టీతో పోలిస్తే పటిష్ఠతను కనబరుస్తోంది. గత శుక్రవారం రూ.1,685 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,650 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,900 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,630 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
రిలయన్స్ ఇండస్ట్రీస్: ఈ షేరు ప్రస్తుతం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రూ.1,450 స్థాయిలో కన్సాలిడేట్ అవుతోంది. ఒడుదొడుకులకు లోనవ్వటం లేదు. పైగా గత నెల గరిష్ఠాన్ని బ్రేక్ చేయటమే కాకుండా నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా ట్రేడవుతోంది. గత శుక్రవారం రూ.1,466 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,430/1,450 స్థాయిలో ప్రవేశించి రూ.1,560 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,400 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
పవర్‌గ్రిడ్: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ షేరు మార్చినుంచి టర్న్ అరౌండ్ అయ్యింది. 30 శాతం వరకు పెరిగాక మళ్లీ హెడ్‌లైన్ సప్లయ్ రావటంతో తగ్గాయి. గత శుక్రవారం గణనీయమైన వాల్యూమ్‌తో 2.2% లాభంతో రూ.293 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.280 పై స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.355 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.270 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
- మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
Updated Date - Jun 23 , 2025 | 03:48 AM