ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: భాగ్యనగరంలో ది కాస్కేడ్స్ నియోపోలిస్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ

ABN, Publish Date - Jun 19 , 2025 | 10:39 PM

హైదరాబాద్ నగరంలో భారీ లగ్జరీ నివాస ప్రాజెక్ట్ "ది కాస్కేడ్స్ నియోపోలిస్" గురువారం మొదలైంది. GHR ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్‌బ్లాక్స్ రియాలిటీ ప్రమోటర్ల భాగస్వామ్య సంస్థ జీహెచ్‌ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పి దీనిని రూ. 3169 కోట్లతో నిర్మిస్తోంది.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీ లగ్జరీ నివాస ప్రాజెక్ట్ "ది కాస్కేడ్స్ నియోపోలిస్" గురువారం మొదలైంది. GHR ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్‌బ్లాక్స్ రియాలిటీ ప్రమోటర్ల భాగస్వామ్య సంస్థ జీహెచ్‌ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పి దీనిని రూ. 3169 కోట్లతో నిర్మిస్తోంది. సంస్థ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 217 మీటర్ల ఎత్తుతో ఐదు 63 అంతస్తుల టవర్లు ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నాయి. మార్చి 2030 నాటికి కొనుగోలుదారులకు అప్పగించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోపోలిస్‌లో 7.34 ఎకరాలలో ఈ ప్రాజెక్ట్ విస్తరించి ఉంది. ఇందులో 1,189.. 3BHK, 4BHK అపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. వీటి విస్తీర్ణం 2,560 చదరపు అడుగుల నుండి 4,825 చదరపు అడుగుల వరకు ఉంది. ఆరోగ్యం, పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ విలాసవంతమైన, స్మార్ట్ లివింగ్ స్పేస్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చటానికి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు వారు తెలిపారు.

డిజైన్, సౌకర్యాలు

UHA లండన్ (కాన్సెప్ట్ ఆర్కిటెక్ట్), కూపర్స్ హిల్ సింగపూర్ (ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్), స్టూడియో HBA సింగపూర్ (ఇంటీరియర్ డిజైన్ - సౌకర్యాలు), బ్యూరో హాపోల్డ్‌‌లాంటి ప్రముఖ ప్రపంచ కన్సల్టెంట్ల నుండి సూచనలు, సలహాలు ప్రాజెక్ట్‌కి తోడ్పడ్డాయి.

పర్యావరణం, ఆరోగ్యం...

ఆరోగ్యం, సంక్షేమం, పర్యావరణ నిర్వహణ కోసం ప్రపంచ ప్రమాణాలు సాధించాలని తాము విశ్వసిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. విద్యుత్ పొదుపు వ్యవస్థలు, అధిక-పనితీరు గల నిర్మాణ సామగ్రి, సాధారణ ప్రాంతాలకు సౌరశక్తి, వర్షపు నీటి సేకరణ, ఇంటి అంతర్గత వాతావరణాన్ని మెరుగుపరచడానికి గాలిని స్వచ్ఛంగా మార్చే వ్యవస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నట్లు చెప్పారు. జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్‌బ్లాక్స్ ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పి భాగస్వామి కార్తీష్ రెడ్డి ఎం మాట్లాడుతూ... "శారీరకంగా, భావోద్వేగంగా ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రదేశాలు సృష్టించడంలోనే జీవితం నిజమైన సారం ఉందని మేము నమ్ముతున్నాం. నియోపోలిస్ ప్రాంతంగా అనేక పచ్చని ప్రదేశాలు, ఇరువైపులా అధిక సంఖ్యలో చెట్లతో విశాలమైన రోడ్లు ఉన్నాయి. ఇది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌ల నుండి వెల్‌నెస్ జోన్‌ల వరకు 'ది కాస్కేడ్స్ నియోపోలిస్' విలాసవంతమైన జీవనానికి మించి ముందుకు వెళ్లటానికి రూపొందించారు" అని పేర్కొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 10:39 PM