Laurus Labs: లారస్ ల్యాబ్స్ లాభం రూ.163 కోట్లు
ABN, Publish Date - Jul 26 , 2025 | 01:34 AM
స్థానిక ఫార్మా కంపెనీ లారస్ ల్యాబ్స్ వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి..
హైధరాబాద్: స్థానిక ఫార్మా కంపెనీ లారస్ ల్యాబ్స్ వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి కంపెనీ రూ.1,570 కోట్ల ఆదాయంపై రూ.163 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 31.3 శాతం మాత్రమే పెరిగినా, నికర లాభం మాత్రం 1,185 శాతం పెరిగింది. కంపెనీ స్థూల లాభం కూడా 127 శాతం వృద్ధితో రూ.389 కోట్లకు చేరింది. కాంట్రాక్ట్ డెవల్‌పమెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్ (సీడీఎంఓ), జనరిక్, ఫినిష్డ్ డోసేజి ఫార్మ్స్ (ఎఫ్‌డీఎఫ్) వ్యాపారాలు పుంజుకోవడం క్యూ1లో బాగా కలిసి వచ్చాయని కంపెనీ వ్యవస్థాకులు, సీఈఓ చావా సత్యనారాయణ తెలిపారు. సీడీఎంఓ, జనరిక్, ఎఫ్‌డీఎఫ్ వ్యాపారాలను మరింత విస్తరించనున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 01:34 AM