ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Petrol Diesel Prices: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ABN, Publish Date - Jun 14 , 2025 | 10:33 AM

Petrol Diesel Prices: బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 74.23 డాలర్ల దగ్గర ట్రేడ్ అయింది. రానున్న రోజుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. అలా అయితే.. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 80 నుంచి 100 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

Petrol Diesel Prices

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకరంగా యుద్ధం నడుస్తోంది. రెండు దేశాలు మిస్సెల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. నిన్న ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. సాధారణం కంటే 10 శాతం ఎక్కువైపోయాయి. ముడి చమురు ధరలు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి పెరగటం జనవరి నుంచి ఇదే మొదటి సారి.

బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 74.23 డాలర్ల దగ్గర ట్రేడ్ అయింది. రానున్న రోజుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. అలా అయితే.. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 80 నుంచి 100 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు పెరిగితే.. ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి దేశీయ ఇంధన విక్రయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. క్రూడ్‌ ఆయిల్ ధర ఒక డాలర్‌ పెరిగితే, మన ఇంధన కంపెనీల లాభానికి 200-300 కోట్ల రూపాయల వరకు గండి పడుతుందని అంచనా.

ముడిచమురు ధర 80 డాలర్లు దాటి మరింత ఎగబాకితే దేశీయంగా ఇంధన కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను పెంచాల్సి రావచ్చు. దాంతో వాహనదారులపై భారం పెరగడంతో పాటు సరుకు రవాణా వ్యయం పెరుగుతుంది. మార్కెట్లో నిత్యావరసరాల ధరలు కూడా ఎగబాకే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ప్రక్రియకూ అడ్డుకట్ట పడుతుంది. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధంతో ప్రపంచ దేశాలు భారీగా నష్టపోనున్నాయి. ఇండియాలోని గ్రామ ప్రజలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.

ఇవి కూడా చదవండి

ఆ పైలట్ విక్రాంత్ బంధువంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హీరో

15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..

Updated Date - Jun 14 , 2025 | 02:52 PM