ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Intel Reduces Workforce: ఇంటెల్‌లో 20 శాతం ఉద్యోగాల కోత

ABN, Publish Date - Apr 24 , 2025 | 03:14 AM

అమెరికా చిప్‌ దిగ్గజం ఇంటెల్‌ ఉద్యోగులను 20 శాతం వరకు తగ్గించనున్నది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

న్యూఢిల్లీ: అమెరికా చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. తద్వారా కంపెనీ సిబ్బందిని 20 శాతం వరకు తగ్గించుకోవాలనుకుంటున్నట్లు బ్లూంబర్గ్‌ కథనం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఈ వారంలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎన్‌విడియా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఇంటెల్‌ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టే బాధ్యతలను కొత్త సారథి లిప్‌-బు టాన్‌ చేతుల్లో పెట్టింది. ఈ మార్చిలో కంపెనీ పగ్గాలు చేపట్టిన టాన్‌.. ఉన్నతాధికార విభాగాన్ని క్రమబద్ధీకరించడంతోపాటు సంస్థలో ఇంజనీర్ల ప్రాధాన్యాన్ని పెంచేందుకు శ్రీకారం చుట్టారు. వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతలపైనా దృష్టి సారించినట్లు తెలిసింది.

Updated Date - Apr 24 , 2025 | 03:15 AM