ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India-UK Free Trade Agreement: ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఎవరికి లాభం?

ABN, Publish Date - Jul 23 , 2025 | 12:41 PM

భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరొకొన్ని గంటల్లో పూర్తి కాబోతోంది. ప్రధాని మోదీ తన ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా గురువారం నాడు ఈ ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు. ఇరు దేశాల మధ్య ఇది సమగ్రా ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా నిలవబోతోంది.

India-UK Free Trade Agreement

భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ (India-UK ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) మరొకొన్ని గంటల్లో పూర్తి కాబోతోంది. ప్రధాని మోదీ (PM Modi) తన ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా గురువారం నాడు ఈ ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు. ఇరు దేశాల మధ్య ఇది సమగ్రా ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా నిలవబోతోంది. 2030 నాటికి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల్లో పలు రంగాలు లాభపడబోతున్నాయి (India-UK Free Trade Agreement).

యూకేలో ప్రస్తుతం వెయ్యికి పైగా భారతీయ కంపెనీలు కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటిల్లో లక్ష మందికి పైగా పని చేస్తున్నారు. భారతీయ పారిశ్రామిక వేత్తలు యూకేలో 1.73 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఇక, భారత్‌లో యూకే పారిశ్రామికవేత్తలు 3.11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. భారత్‌లో యూకే ఆరో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా నిలిచింది. కాగా, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బ్రిటిష్ పార్లమెంట్, భారత కేంద్ర మంత్రివర్గం నుంచి చట్టపరమైన అనుమతులు పొందిన తర్వాత, ఒక సంవత్సరంలోపు అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

భారత్ నుంచి యూకే పొందే రాయితీలు:

  • ప్రస్తుతం యూకే నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న స్కాచ్ విస్కీ, జిన్‌పై 150 శాతం సుంకాలను విధిస్తున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో ఆ సుంకాలు 75 శాతానికి దిగి వస్తాయి. రాబోయే పదేళ్లలో ఆ పన్నులు 40 శాతానికి తగ్గుతాయి.

  • యూకే తయారీ కార్లకు భారత్‌లో ప్రస్తుతం వంద శాతం పన్నులు విధిస్తున్నారు. ఒప్పందం తర్వాత ఆ పన్నులు పది శాతానికి తగ్గుతాయి.

  • సౌందర్య సాధనాలు, సాల్మన్, చాక్లెట్లు, బిస్కెట్లు, వైద్య పరికరాలతో సహా అనేక యూకే ఉత్పత్తులపై భారత్ పన్నులను తగ్గించబోతోంది.

యూకే నుంచి భారత్ పొందే రాయితీలు:

  • భారత్ నుంచి యూకేకు ఎగుమతి అయ్యే దాదాపు 99 శాతం వస్తువులపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది.

  • వస్త్రాలు, పాదరక్షలు, ఆటో భాగాలు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నిచర్, క్రీడా వస్తువులు, రసాయనాలు, యంత్ర పరికరాలపై యూకే ప్రభుత్వం ప్రస్తుతం 16 శాతం వరకు పన్ను విధిస్తోంది. ఇకపై ఈ ఉత్పత్తులకు యూకేలో పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది.

  • ఈ మేరకు భారతీయ వస్త్ర, ఫుట్‌వేర్, ఆటో మొబైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థలు భారీగా లాభపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

బంగారం ధర మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 01:04 PM