Vikram Misri: ట్రంప్ భారత్ సుంకాల వ్యాఖ్యలపై విదేశాంగ కార్యదర్శి రియాక్షన్
ABN, Publish Date - Mar 08 , 2025 | 09:41 PM
భారతదేశం సుంకాలను తగ్గించడానికి అంగీకరించిందని ట్రంప్ ప్రకటించిన వ్యాఖ్యలపై తాజాగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. కానీ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినట్లు శనివారం ఆయా వర్గాలు తెలిపాయి. దీనిపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం తాము స్పందించబోమన్నారు. కానీ భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలను సుంకాల సరళీకరణపై కుదుర్చుకుందన్నారు. అమెరికా నుంచి వచ్చే ప్రకటనలపై ఆసక్తి ఉందని, వీటిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని స్ఫష్టం చేశారు. ఈ సమస్యల గురించి అనేక ఇతర భాగస్వాములతో కూడా చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఏప్రిల్ 2 గడువు
ప్రస్తుతం భారతదేశం అమెరికాతో సుంకాల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 2 గడువుకు ముందు ఈ సమస్య పరిష్కారం కావాలని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. ఈ సమయంలోపే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ కొత్త సంవత్సరంలో అనేక మర్పులు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మార్కెట్ ను మెరుగుపరచడం, సుంకాలు, ఇతర అడ్డంకులను తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు .
ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు:
భారతదేశం ఇప్పటికే ఆస్ట్రేలియా, యుఏఈ, స్విట్జర్లాండ్, నార్వే వంటి ప్రముఖ దేశాలతో అనేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు సగటు సుంకాన్ని తగ్గించే ప్రక్రియను అనుసరిస్తున్నాయి.
అమెరికా పర్యటన:
ఈ పర్యటనలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలోని బృందం మార్చి 3 నుంచి 6 వరకు వాషింగ్టన్‌లో చర్చలు జరిపింది. ఈ క్రమంలో 2030 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత వంటి కీలక రంగాలతోపాటు అనేక అంశాలపై చర్చలు జరిగినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
EPFO: కొత్త అప్డేట్ .. EDLI స్కీం ద్వారా మరిన్ని ప్రయోజనాలు
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో నుంచి కీలక అప్ డేట్.. డిజైన్ సహా కీలక ఫీచర్స్ లీక్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 08 , 2025 | 09:45 PM