iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో నుంచి కీలక అప్ డేట్.. డిజైన్ సహా కీలక ఫీచర్స్ లీక్
ABN , Publish Date - Mar 08 , 2025 | 05:59 PM
ఐఫోన్ 17 ప్రో లాంచ్ సమయానికి మరికొన్ని నెలల సమయం ఉంది. కానీ ఈ మోడల్ డిజైన్‌లో పెద్ద మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కెమెరాలో కూడా కీలక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

టెక్ ప్రియులకు అలర్ట్ వచ్చేసింది. ఇప్పటికే ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లోకి రాగా, మరోవైపు తాజాగా ఐఫోన్ 17 ప్రో నుంచి లీకులు మొదలయ్యాయి. ఐఫోన్ 11 విడుదలైనప్పటి నుంచి, ఆపిల్ తన పాత డిజైన్ ప్యాటర్న్‌ను కొనసాగిస్తోంది. కానీ ఐఫోన్ 17 ప్రోతో ఇది మారనుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ ఆపిల్ టిప్‌స్టర్ జాన్ ప్రాసెర్ అందించిన సమాచారం ప్రకారం ఐఫోన్ 17 ప్రోలో పెద్ద కెమెరా ఐలాండ్ ఉండబోతుందని అంటున్నారు. ఇది స్మార్ట్‌ఫోన్ వెడల్పులో విస్తరించి ఉంటుందని సమాచారం. ఈ కెమెరా గుండ్రని మూలాలను కలిగి ఉండి, ఎడమ వైపున మూడు కెమెరాలు, కుడి వైపున LED ఫ్లాష్, LiDAR స్కానర్, మైక్రోఫోన్ ఉంటాయని చెబుతున్నారు.
కెమెరా, డిజైన్‌లో మార్పులు
ఈ కెమెరా మిగిలిన భాగాల కంటే ముదురు రంగులో ఉండి, పరికరానికి డ్యూయల్-టోన్ ముగింపు ఇస్తుందని టిప్‌స్టర్ అన్నారు. అదనంగా ఆపిల్ ఈసారి టైటానియం బదులుగా అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగించబోతుందని తెలుస్తోందన్నారు. ఈ పరికరం వెనుక భాగంలో పార్ట్ అల్యూమినియం, పార్ట్ గ్లాస్ డిజైన్ ఉండబోతుందని అంచనా వేశారు. ఈ క్రమంలో కెమెరా విభాగంలో కీలక అప్‌గ్రేడ్ ఉంటుందన్నారు. నివేదికల ప్రకారం ఐఫోన్ 17 సిరీస్‌లో అన్ని మోడళ్లలో కొత్త 24MP సెల్ఫీ కెమెరా ఉండబోతుంది. కాన ఐఫోన్ 17 ప్రోలో 48MP హై రిజల్యూషన్ టెలిఫోటో లెన్స్ ఉండవచ్చని చెప్పారు.
పనితీరు, ప్రాసెసర్‌లో ప్రత్యేకతలు
ఐఫోన్ 17 ప్రోలో ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్ ఉండవచ్చని, ఇది TSMC 3nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. దీని ద్వారా మెరుగైన పనితీరు, బ్యాటరీ సామర్థ్యం లభిస్తుందని చెప్పారు. ఇది కాకుండా ఈసారి ఐఫోన్ 17 ప్రోలో 12GB RAM ఉండవచ్చని, ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న 8GB RAM కంటే పెద్ద అప్‌గ్రేడ్ అవుతుందన్నారు. క్వాల్కమ్ మోడెమ్‌కు బదులుగా, ఆపిల్ తన సొంతంగా అభివృద్ధి చేసిన మోడెమ్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Swiggy: ఈ రైల్వే స్టేషన్లలో కూడా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు..
Toyota: టయోటా నుంచి మార్కెట్లోకి కొత్త ఎడిషన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News