India UK FTA: బ్రిటన్‌కు మరిన్ని మత్స్య ఎగుమతులు
ABN, Publish Date - Aug 06 , 2025 | 01:35 AM
భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్‌టీఏ మన దేశ మత్స్య ఎగుమతులకు
కలిసి రానున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
న్యూఢిల్లీ: భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మన దేశ మత్స్య ఎగుమతులకు బాగానే కలిసి రానుంది. ప్రస్తుతం బ్రిటన్ మన దేశం నుంచి ఎగుమతయ్యే మత్స్య దిగుమతులపై 8.9 శాతం చొప్పున దిగుమతి సుంకం విధిస్తోంది. ఎఫ్‌టీఏతో ఈ సుంకం పూర్తిగా రద్దు కానుంది. దీంతో ప్రస్తుతం ఏటా బ్రిటన్‌కు రూ.1,000 కోట్ల వరకు ఉన్న మన మత్స్య ఎగుమతులు వచ్చే మూడేళ్లలో మూడింతలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీకీ మేలు
ఈ ఎఫ్‌టీఏ తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బాగా మేలు చేయనుంది. మన దేశం నుంచి జరిగే రొయ్యల ఎగుమతుల్లో దాదాపు 60 నుంచి 70 శాతం ఏపీ నుంచే ఎగుమతవుతాయి. ట్రంప్ సుంకాలతో బేల చూపులు చూస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల ఎగుమతిదారులకూ భారత-బ్రిటన్ ఎఫ్‌టీఏ కలిసిరానుంది. అయితే ట్రంప్ సుంకాల నేపథ్యంలో బ్రిటన్‌లోని దిగుమతిదారులు ధరలు తగ్గించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Updated Date - Aug 06 , 2025 | 01:35 AM