ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RBI Vostro Accounts: భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం

ABN, Publish Date - Aug 11 , 2025 | 06:03 PM

భారతీయ కరెన్సీలో అంతర్జాతీయ చెల్లింపులను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అధీకృత భారతీయ బ్యాంకులు తమ ముందస్తు అనుమతి లేకుండానే విదేశీ బ్యాంకుల్లో ప్రత్యేక రూపీ వాస్ట్రో అకౌంట్స్ ప్రారంభించొచ్చని తాజాగా వెల్లడించింది.

India Rupee Trade Settlement RBI

ఇంటర్నెట్ డెస్క్: డాలర్‌ను బలహీనపరిస్తే ఊరుకునేది లేదంటూ ట్రంప్ హెచ్చరిస్తున్న వేళ భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల్లో భారతీయ కరెన్సీతో చెల్లింపులను ప్రోత్సహించేందుకు తమ ముందస్తు అనుమతి లేకుండానే భారతీయ అధీకృత బ్యాంకులు విదేశీ బ్యాంకుల్లో స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్‌లను ప్రారంభించొచ్చని వెల్లడించింది. ఈ మేరకు ఇటీవల ఓ సర్క్యూలర్‌ను విడుదల చేసింది. రూపాయిల్లో వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్‌ను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు తాజా ఆదేశాలు పొడిగింపు అని కూడా పేర్కొంది.

ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం, ఇకపై ఎగుమతి దిగుమతుల తాలూకు చెల్లింపులను రూపాయిల్లో చేయడం మరింత సులభం కానుంది. ఈ క్రమంలో దేశాల మధ్య కరెన్సీ ఎక్సేంజ్ రేటు మార్కెట్ పరిస్థితులను అనుసరించి నిర్ణయించనున్నారు. గతంలో అధీకృత బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నాకే వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి వచ్చేది. ట్రంప్ సుంకాల బాదుడు నేపథ్యంలో ఈ విధానాన్ని సవరిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

చైనా, రష్యాలు ఇప్పటికే తమ దేశీయ కరెన్సీలతో వాణిజ్యం నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా, బ్రిక్స్ కూటమి దేశాల కోసం ఓ ఉమ్మడి కరెన్సీ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ రూపాయిల్లో చెల్లింపులను ప్రోత్సహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బ్రిక్స్ దేశాలు తమకంటూ సొంత కరెన్సీ ఏర్పాటు చేసుకుంటే ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు రష్యా చమురు కొంటున్నందుకు భారత్‌పై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచేశారు. మరి కొద్ది రోజుల్లో ఈ సుంకం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. అయితే, ఈ ఒత్తిడులకు తలొగ్గేది లేదని భారత్ స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత అని తేల్చి చెప్పింది. భారతీయ రైతులు, మత్స్యకారులు, డెయిరీ రంగానికి నష్టం కలుగనివ్వబోమని ప్రధాని మోదీ ఇటీవలే స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

Read Latest and Business News

Updated Date - Aug 11 , 2025 | 06:14 PM