ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Direct Tax Collections: ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.22.26 లక్షల కోట్లు

ABN, Publish Date - Apr 26 , 2025 | 04:24 AM

2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి 99.51 శాతం స్థాయిలో ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి.రూ.22.26 లక్షల కోట్ల వసూళ్లు సాధించడంతో గతేడాదితో పోలిస్తే 13.57 శాతం వృద్ధి నమోదు అయింది.

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024-25) నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు దాదాపుగా నిర్ణీత లక్ష్యాన్ని చేరాయి. మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి నికరంగా రూ.22.37 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రూ.22.26 లక్షల కోట్లు వసూలు చేయడం ద్వారా 99.51 శాతం లక్ష్యాన్ని సాఽధించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 13.57 శాతం ఎక్కువ. అయితే ఇది తాత్కాలిక అంచనా మాత్రమేనని, ఇంకా పూర్తి రిఫండ్‌ వివరాలు ఆందాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ తాత్కాలిక అంచనాల ప్రకారం చూసినా 2024-25లో ఆదాయ పన్ను శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.4,76,743 కోట్ల రిఫండ్స్‌ జారీ చేసింది.

Updated Date - Apr 26 , 2025 | 04:25 AM