ITR Filing: పన్ను పెండింగ్ ఉందా.. ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ ఇదే..
ABN, Publish Date - Jun 02 , 2025 | 02:49 PM
ప్రతి ఏడాదిలాగే, ఈసారి కూడా పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ గడువును (income tax return deadline 2025) పెంచింది. తాజాగా 2025–26 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) పొడిగించింది.
ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు (income tax return deadline 2025). సీబీడీటీ మంగళవారం ఈ సమాచారాన్ని తెలిపింది. తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సంస్థలు జూలై 31 లోపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేయాలని ఈ సందర్భంగా తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో వెలువడనుంది.
పన్ను చెల్లింపుదారులకు
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఒక ప్రకటనలో ఇలా తెలిపింది. CBDT జూలై 31, 2025 నాటికి దాఖలు చేయాల్సిన ITR గడువు తేదీని సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించాలని నిర్ణయించింది. ITR ఫారమ్‌ల అభివృద్ధి అవసరాలు, TDS క్రెడిట్‌లలో గణనీయమైన సవరణల కారణంగా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు పన్ను చెల్లింపుదారులు సజావుగా, సౌకర్యవంతంగా ITR దాఖలు చేసేందుకే చివరి తేదీని సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించినట్లు సీబీడీటీ తెలిపింది.
మొదటి వారం నుంచి
ఐటీఆర్‌లో చేసిన మార్పులు, వ్యవస్థను సిద్ధం చేయడానికి తీసుకున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయా విభాగం ఈ గడువును పెంచింది. అధికారిక నోటిఫికేషన్ త్వరలో అధికారికంగా విడుదల కానుంది. CBDT జారీ చేసిన ప్రకటన ప్రకారం, మే 31 నుంచి దాఖలు చేయవలసిన TDS సెటిల్‌మెంట్‌లు జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం, ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మీరు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి సంపాదిస్తే అనేక నియమాలను పాటించాలి.
ఏది ఎంచుకోవాలి..
మొదట మీరు అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. అందులో మీ ఫారమ్ 26 AS, TDS సహా ఇతర పత్రాలు ఉంటాయి. ఆ తర్వాత, సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవాలి. ITR 3, ITR 4 అనే రెండు ఫారమ్‌లు ఉంటాయి. ఇవి వ్యాపారం, ఇతర వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఉపయోగపడతాయి. అదే సమయంలో, అంచనా వేసిన వ్యాపార ఆదాయాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులు ITR-4ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 02:52 PM