ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Rate: ఈ 6 దేశాల్లో బంగారం ధర ఇండియా కంటే చాలా తక్కువ

ABN, Publish Date - Apr 21 , 2025 | 05:06 PM

Gold Rate: ఇండియాతో పోల్చుకుంటే ఓ ఆరు దేశాల్లో బంగారం చాలా చీప్ ధరలకు దొరుకుతుంది. బంగారం చాలా చీప్‌గా దొరికే ఆ ఆరు దేశాలు ఏవి.. ఆ దేశాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎంత ఉన్నాయో ఓ లుక్ వేయండి.

Gold Rate

భారత దేశంలో బంగారం ధరలు జెట్ స్పీడులో పరుగులు తీస్తున్నాయి. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర లక్షకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 90 దగ్గర ట్రేడ్ అవుతోంది. శుభకార్యాలకు బంగారం కొనాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు గోల్డ్ వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. అయితే, మన దేశంలో లక్ష రూపాయలు పలుకుతున్న బంగారం ధర.. కొన్ని దేశాల్లో చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఓ ఆరు దేశాల్లో బంగారం చాలా చీప్‌గా దొరుకుతుంది. ఆ 6 దేశాలు ఏవి.. ఆ దేశాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం.


1) అమెరికా

అమెరికాలో బంగారం చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. ఇంటర్‌నేషనల్ మార్కెట్‌లో బంగారం లావాదేవీలు అమెరికన్ డాలర్లలోనే జరుగుతాయి. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ బంగారంపై టాక్సులు తక్కువ. అంతేకాదు. కాంపిటీటివ్ మార్కెట్ కండీషన్ కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతుంది. అమెరికాలో గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 107 డాలర్లు..9,125 రూపాయలుగా ఉంది.

2) ఆస్ట్రేలియా

ఇక్కడ బంగారం గనులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. బంగారాన్ని బయటకు తీసి, ప్రాసెస్ చేసి మార్కెట్‌లోకి వదులుతూ ఉంటారు. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ బంగారం తక్కువ ధరకే దొరకుతుంది. ఆస్ట్రేలియాలో ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 9,227 రూపాయలుగా ఉంది.

3) సింగపూర్

అమెరికా, ఆస్ట్రేలియాల కంటే చాలా తక్కువ ధరకే సింగపూర్‌లో బంగారం దొరుకుతుంది. ఈ దేశంలో బంగారంపై జీఎస్టీ లేదు. ఇతర ట్యాక్సులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రోజు సింగపూర్‌లో ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 8,663.87 రూపాయలు ఉంది.


4) స్విట్జర్లాండ్

ఈ దేశంలో గడియారాలు, చాక్లెట్లు మాత్రమే కాదు.. టాప్ గ్రేడ్ స్వచ్ఛమైన బంగారం కూడా దొరుకుతుంది. అది కూడా తక్కువ ధరకే. ఇక్కడ బంగారాన్ని రిఫైన్ చేసే పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఈ రోజు స్విట్జర్లాండ్‌లో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 8,816.96 రూపాయలుగా ఉంది.

5) దుబాయ్

బంగారం కొనాలనుకునే వారికి ముందుగా గుర్తుకు వచ్చేది దుబాయ్. ఇక్కడ ఇండియాతో పోల్చుకుంటే బంగారం తక్కువ ధరకే కొనచ్చు. ఈ రోజు దుబాయ్‌లో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 9,433.85 రూపాయలుగా ఉంది. డ్యూటీ ఫ్రీగా మగాళ్లు 5 గ్రాముల బంగారం.. ఆడవాళ్లు 10 గ్రాముల బంగారాన్ని ఇండియాకు తెచ్చుకోవచ్చు.

6) ఇండోనేషియా

ఇక్కడ బంగారాన్ని గనుల నుంచి తవ్వి తీసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక గ్రాము 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 9,282.49 రూపాయలుగా ఉంది.


ఇవి కూడా చదవండి

Body In Trolley Bag: దుబాయ్ నుంచి వచ్చి 10 రోజులు.. అంతలోనే శవమై..

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం

Updated Date - Apr 21 , 2025 | 05:06 PM