ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IBM Layoffs: ఏఐ ఎఫెక్ట్.. ఐబీఎమ్‌లో 8 వేల మంది తొలగింపు.. హెచ్ఆర్‌లో అధిక కోతలు

ABN, Publish Date - May 27 , 2025 | 12:58 PM

ఏఐ వినియోగం పెంపులో భాగంగా ఐబీఎమ్‌లో తాజాగా 8 వేల మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.

IBM job cuts AI

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎమ్‌లో ఏకంగా 8 వేల మందిని తొలగించినట్టు తెలుస్తోంది. సంస్థ హెచ్‌ఆర్ విభాగంలో అధికశాతం లేఆఫ్స్‌ చోటుచేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 200 మంది హెచ్ఆర్ ఉద్యోగుల స్థానంలో ఏఐ ఏజెంట్లను (కృత్రిమే మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్లు) నియమించినట్టు సంస్థ ప్రకటించిన కొన్ని రోజులకే లేఆఫ్స్ వార్తలు వైరల్‌ కావడం కలకలం రేపుతోంది (IBM job cuts).

ఐబీఎమ్‌లో హెచ్‌‌ఆర్ సమాచారాన్ని క్రోడీకరించడం, ఉద్యోగుల ఈమెయిల్స్‌‌కు ప్రత్యుత్తరాలివ్వడం, పేపర్‌వర్క్‌ను ప్రాసెస్ చేయడం వంటి సాధారణ పనులు ఏఐ ఏజెంట్లకు అప్పగించినట్టు తెలుస్తోంది. మనుషుల జోక్యం అంతగా అవసరం లేని రిపిటీటివ్ పనులను ఏఐకి అప్పగిస్తున్నట్టు సమాచారం. అయితే, సంస్థ ఏఐ వైపు అధికంగా మళ్లుతుండటంతో వేలల్లో ఉద్యోగాలు పోతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఏఐ వినియోగంపై ఇటీవలే ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ స్పందించారు. సంస్థలో కార్యకలాపాలు మరింత సరళతరం చేసేందుకు ఏఐ, ఆటోమేషన్‌ వినియోగాన్ని పెంచుతున్నట్టు చెప్పారు. తద్వారా వివిధ టీమ్స్ ఉత్పాదకత మరింత పెరిగిందని చెప్పారు. ఇలా పొదుపు చేసిన సొమ్మును పెట్టుబడులు అధికంగా అవసరం ఉన్న సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లోకి మళ్లిస్తున్నట్టు తెలిపారు. ఏఐ వినియోగం తరువాత సంస్థలో ఉద్యోగుల సంఖ్య పెరిగిందని కూడా అన్నారు.

ఉద్యోగుల సంఖ్యను కుదించేందుకు తాము ప్రయత్నించట్లేదని ఐబీఎమ్ చెబుతోంది. సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచన ధోరణి, పీపుల్స్ స్కిల్స్ అవసరమైన సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్, మార్కెటింగ్ విభాగాలపై దృష్టి పెడుతున్నట్టు చెప్పింది. .


ఏఐతో ఉద్యోగాలన్నిటికీ ముప్పు ఉన్నట్టు భావించరాదని ఐబీఎమ్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ నికల్ లామొరో తెలిపారు. కొన్ని బాధ్యతలను మాత్రమే పూర్తిగా ఏఐకి అప్పగించడం సాధ్యమవుతుందని అన్నారు. రిపిటీటివ్ బాధ్యతలను ఏఐ చక్కబెడుతుందని వివరించారు. ఇదిలా ఉంటే ఐబీఎమ్‌తో సహా అనేక సంస్థలు ఏఐ బాట పడుతున్నాయి. కొత్త ఉద్యోగిని తీసుకునే ముందు అతడి బాధ్యతలు ఏఐ ఎందుకు చేయలేదో ఒకసారి ప్రశ్నించుకున్నాకే ముందడుగు వేయాలని షాపిఫై సంస్థ సీఈఓ ఉద్యోగులకు అంతర్గతంగా జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 01:07 PM