ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyundai Company: నం.2 స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంటాం

ABN, Publish Date - May 17 , 2025 | 02:32 AM

నెం.2 స్థానాన్ని తిరిగి సంపాదించేందుకు హ్యుండయ్‌ సంస్థ దూకుడు పెంచింది. కొత్త మోడల్స్‌, గ్రామీణ మార్కెట్‌, పాత కార్ల విక్రయాలపై దృష్టి పెట్టినట్లు సీఓఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.

  • హ్యుండయ్‌ సీఓఓ తరుణ్‌ గార్గ్‌

న్యూఢిల్లీ: దేశీయ కార్ల మార్కెట్లో నం.2 స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంటామని హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) తరుణ్‌ గార్గ్‌ అన్నారు. ఇందుకోసం కంపెనీ కార్యకలాపాల్లో దూకుడు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా మార్కెట్లోకి పలు కొత్త మోడల్‌ కార్లను విడుదల చేయడంతో పాటు గ్రామీణ, సంస్థాగత మార్కెట్లలో, పాత కార్ల (ప్రీ-ఓన్డ్‌) విభాగంలో విక్రయాలను పెంచేందుకు కృషి చేయనున్నట్లు శుక్రవారం కంపెనీ ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఆయన తెలిపారు. దేశీయ మార్కెట్లో చాలా కాలంగా రెండో అతిపెద్ద కార్ల విక్రయదారుగా కొనసాగుతూ వచ్చిన హ్యుండయ్‌.. గత నెలలో నాలుగో స్థానానికి జారుకుంది. విక్రయాలపరంగా మారుతి సుజుకీ తర్వాత రెండు, మూడు స్థానాలను మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ ఆక్రమించాయి.

క్యూ4 లాభం రూ.1,614 కోట్లు: మార్చి త్రైమాసికం (క్యూ4)లో హ్యుండయ్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4 శాతం తగ్గి రూ.1,614 కోట్లకు జారుకుంది. ఆదాయం మాత్రం రూ.17,940 కోట్లకు పెరిగింది.

Updated Date - May 17 , 2025 | 02:34 AM