Indian GCC Cities Ranking: జీసీసీల అడ్డా హైదరాబాద్
ABN, Publish Date - Jul 22 , 2025 | 05:10 AM
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలతో పాటు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కూ హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది...
273 జీసీసీలతో దేశంలో రెండో స్థానం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలతో పాటు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కూ హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ప్రస్తుతం దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువ జీసీసీలు కొలువుదీరాయి. దేశంలో ఉన్న దాదాపు 1,700 జీసీసీల్లో 29 శాతం (487) బెంగళూరులో ఉంటే, 273 జీసీసీలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. అమెరికా కేంద్రంగా పనిచేసే రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ వెస్టియన్ ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ (272), ముంబై (207), పుణె (178), చెన్నై (162) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా నగరాల్లో పెరుగుతున్న మౌలిక వసతులు, నిపుణులైన ఉద్యోగులు దొరకడం, ప్రభుత్వాల ప్రోత్సాహం, ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చులు మన దేశంలో పెద్దఎత్తున జీసీసీల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాయి.
నివేదికలోని ఇతర ప్రధానాంశాలు
దేశంలోని మొత్తం జీసీసీల్లో 55 శాతం (922) బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోనే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,200 జీసీసీల్లో 53 శాతం భారత్‌లోనే
దేశంలోని మొత్తం జీసీసీల్లో 94 శాతం ఆరు నగరాల్లోనే ఉన్నాయి
2028 నాటికి దేశంలో జీసీసీల సంఖ్య 2,100 దాటే అవకాశం
ఏటా కొత్తగా 150 జీసీసీల ఏర్పాటు
దేశంలోని జీసీసీల్లో దాదాపు సగం ఐటీ, ఐటీఈఎస్ ఆధారిత జీసీసీలు
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 22 , 2025 | 05:10 AM