ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Highest Fixed Deposit Rates: FD పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఈ చిన్న బ్యాంకుల్లో 8 శాతం వరకు వడ్డీ..

ABN, Publish Date - Jun 19 , 2025 | 04:26 PM

దేశంలో పెద్ద పెద్ద బ్యాంకులతో పాటు చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇవి 8.60 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అధిక రాబడిని కోరుకునే సాంప్రదాయవాద పెట్టుబడిదారులకు ఇవి ఆకర్షణీయమైన ఆప్షన్స్‌గా మారుతున్నాయి. మరి చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లు అందిస్తున్న వడ్డీ రేట్లు ఎంతో ఓసారి తెలుసుకుందాం..

Highest Fixed Deposit Rates

Highest Fixed Deposit Rates: నేటి అస్థిర మార్కెట్ పరిస్థితులలో రిస్క్‌ చేసి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరనేది వాస్తవం. అందుకే.. చాలా మంది సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ల కోసం వెతుకుతుంటారు. మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం కంటే.. మంచి వడ్డీ రేట్లు వచ్చే ఫైనాన్స్ సంస్థలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. చాలా మంది ప్రధాన బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేస్తుంటారు. మరికొందరు ఎక్కువ వడ్డీ రేటు అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌(SFB) లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల స్థిరమైన రాబడి రావడంతో పాటు.. ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు రక్షణ ఉంటుంది. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఒక్కో బ్యాంకు ఒక్కో విధమైన వడ్డీ రేట్‌ను అందిస్తుంది. అధిక వడ్డీ రేటు అందించే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటే ఏంటి..?

దేశంలో బ్యాకింగ్ రంగంలో పెద్ద పెద్ద బ్యాంకులతో పాటు.. చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ బ్యాంకులు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలోని వెనుకబడిన వర్గాలకు సేవలు అందిస్తుంటాయి. సాంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. భద్రత, మెరుగైన రాబడిని కోరుకునే పొదుపుదారులకు ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి.

మీరు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేద్దామని భావిస్తున్నారా.. పొదుపు డబ్బును పెంచుకోవానుకుంటున్నారా.. అత్యధిక ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. .

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు.. అవి అందిస్తున్న వడ్డీ రేట్లు(2025 జులై ప్రకారం..)

1) బ్యాంక్ పేరు: యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అత్యధిక వడ్డీ రేట్: 8.60(1001 రోజులు)

ఒక సంవత్సర కాలానికి 7.00 శాతం.

3 సంవత్సరాల కాలానికి 8.00 శాతం.

5 సంవత్సరాల కాలానికి 8.00 శాతం.

2) బ్యాంక్ పేరు: సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అత్యధిక వడ్డీ రేట్: 8.40 (>30ని – 3సంవత్సరాలు)

ఒక సంవత్సర కాలానికి 7.90 శాతం.

3 సంవత్సరాల కాలానికి 8.40 శాతం.

5 సంవత్సరాల కాలానికి 8.00 శాతం.

3) బ్యాంక్ పేరు: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అత్యధిక వడ్డీ రేట్: 8.25 (2సం - 3సం)

ఒక సంవత్సర కాలానికి 6.25 శాతం.

3 సంవత్సరాల కాలానికి 8.25 శాతం.

5 సంవత్సరాల కాలానికి 7.75 శాతం.

4) బ్యాంక్ పేరు: జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అత్యధిక వడ్డీ రేట్: 8.20 (5 సంవత్సరాలు)

ఒక సంవత్సర కాలానికి 7.50 శాతం.

3 సంవత్సరాల కాలానికి 7.75 శాతం.

5 సంవత్సరాల కాలానికి 8.20 శాతం.

5) బ్యాంక్ పేరు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అత్యధిక వడ్డీ రేట్: 8.05 (18 నెలలు)

ఒక సంవత్సర కాలానికి 7.90 శాతం.

3 సంవత్సరాల కాలానికి 7.20 శాతం.

5 సంవత్సరాల కాలానికి 7.20 శాతం.

6) బ్యాంక్ పేరు: ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అత్యధిక వడ్డీ రేట్: 7.80 (888 రోజులు)

ఒక సంవత్సర కాలానికి 7.60 శాతం.

3 సంవత్సరాల కాలానికి 7.50 శాతం.

5 సంవత్సరాల కాలానికి 7.25 శాతం.

7) బ్యాంక్ పేరు: ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అత్యధిక వడ్డీ రేట్: 7.60 (444 రోజులు)

ఒక సంవత్సర కాలానికి 4.75 శాతం.

3 సంవత్సరాల కాలానికి 6.00 శాతం.

5 సంవత్సరాల కాలానికి 5.75 శాతం.

8) బ్యాంక్ పేరు: AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అత్యధిక వడ్డీ రేట్: 7.25 (2y 1d – 3y).

ఒక సంవత్సర కాలానికి 6.50 శాతం.

3 సంవత్సరాల కాలానికి 7.25 శాతం.

5 సంవత్సరాల కాలానికి 6.75 శాతం.

(జూన్ 18, 2025న సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం..)

చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం ప్రమాదకరమా?

చిన్న ఫైనాన్స్ బ్యాంకల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం వలన అధిక రాబడి వస్తుంది కానీ.. కొంచెం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే.. ఈ బ్యాంకులు ప్రత్యేక రుణగ్రహీతలకు రుణాలు అందిస్తాయి. ఒక్కోసారి వారి ఆ రుణాలను ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. తద్వారా డిఫాల్ట్‌లకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే, రూ.5 లక్షల వరకు స్థిర డిపాజిట్‌లకు డిపాజిట్ ఇన్యూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(DICGC) బీమా చేస్తుంది. ఫలితంగా చిన్న పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి.

ఏది ఎంచుకోవాలి..?

మార్కెట్ రిస్క్ తీసుకోకుండా తమ రాబడిని పెంచుకోవాలనుకునే పెట్టుబడిదారులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎఫ్‌డీలు స్వల్ప నుంచి మధ్యస్థ కాలానికి సాంప్రదాయ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయినప్పటికీ.. మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే.. ముందుగా బ్యాంకు విశ్వసనీయత, దాని ట్రాక్ రికార్డ్‌ను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు కేవలం ప్రజల సాధారణ ప్రయోజనాలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. ఆర్థిక సలహా గానీ.. సిఫార్సుగా గానీ పరిగణించొద్దని కోరుతున్నాము. ఇక వడ్డీ రేట్లు అనేవి ఆయా బ్యాంకుల నిర్ణయాల మేరకు ఉంటుంది. పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని.. బ్యాంకుల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. అంతకంటే ముఖ్యంగా ఎఫ్‌డీలు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.

Also Read:

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

For More Business News

Updated Date - Jun 19 , 2025 | 05:51 PM