ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధరలు..

ABN, Publish Date - May 01 , 2025 | 12:08 PM

బంగారం.. భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. పండగలు, పెళ్లిళ్లకు ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయడం మనోళ్ల ఆనవాయితీ. ఒక దశలో భారీగా పెరిగి ఒక లక్ష రూపాయలకు దగ్గరలో చేరుకున్న పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒక్క రోజు తులం బంగారం రూ. 2,300 తగ్గింది.

Today Gold Rate

హైదరాబాద్: బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి (Gold Price Drop) ఒక్క రోజులోనే తులం బంగారం రూ. 2,300 తగ్గింది. మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 95,700 ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,750గా ఉంది. ఇక కిలో వెండి (Silver Price) దర రూ. 99,900 పలుకుతోంది. బంగారం ధరలు ఒక దశలో భారీగా పెరిగి ఒక లక్ష రూపాయలకు దగ్గరలో చేరుకుంది. అక్కడ నుంచి తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన కారణంగా స్టాక్ మార్కెట్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.


చైనాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర భారీగా తగ్గుతుందని కూడా సూచన చేస్తున్నారు.

Also Read: మార్కో రుబియో ఫోన్ కాల్‌పై ఎస్ జయశంకర్ ఎమన్నారంటే..


కొనుగోళ్లలో అదే జోరు...

కాగా అక్షయ తృతీయ రోజున పసిడికి డిమాండ్ తగ్గలేదు. బుధవారం (ఏప్రిల్ 30) బంగారం కొనుగోళ్లు భారీగానే జరిగాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అందుకే మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పటికీ కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గలేదు. గత ఏడాది కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతూ ప్రస్తుతం తులం బంగారం రూ.లక్షకు చేరువలో ఉంది. అయినప్పటికీ, ఈ అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోళ్లు చురుగ్గానే సాగాయని ఆభరణాల వర్తకులు చెబుతున్నారు. విక్రయాల పరిమాణం మాత్రం గత ఏడాదిలాగే 20 టన్నుల స్థాయిలో ఉండవచ్చని అసోసియేషన్‌ చైర్మన్‌ రాజేశ్‌ రోక్డే అన్నారు.

బంగారం స్వచ్ఛమైనదా కాదా, ఇలా చెక్ చేయండి

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారం 0.916 స్వచ్ఛతను కలిగి ఉండాలి (22/24 = 0.916). 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి కల్తీ ఉండదు.


ఈ వార్తలు కూడా చదవండి..

కార్మిక లోకానికి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు

అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్‌డౌన్..

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 12:08 PM