ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

ABN, Publish Date - Jun 04 , 2025 | 06:54 AM

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,800 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,060 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,300 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate

ఇంటర్‌నెట్ డెస్క్‌‌‌: భారత్, పాకిస్తాన్ యుద్ధం తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం.. యుద్ధం తర్వాత 96 వేలకు చేరింది. బంగారం కొనాలనుకునే వారు ఎంతో సంతోషించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. బంగారానికి రెక్కలు వచ్చాయి. 96 వేల నుంచి ఇప్పుడు 99 వేలకు స్వచ్ఛమైన బంగారం ధర చేరింది. పేద, మధ్య తరగతి వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.


హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,800 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,060 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,300 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,070 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,810 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,310 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


నగరంలో వెండి ధరలు ఇలా ..

మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, ఈ రోజు వెండి ధరలు కూడా అనుకోని షాక్ ఇచ్చాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10,010 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,00,100 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 10,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,00,200 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

పసిడి ర్యాలీకి బ్రేక్‌

ప్రజలపై ప్రతీకారంగానే వైసీపీ వెన్నుపోటు దినం

Updated Date - Jun 04 , 2025 | 07:04 AM