ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold And Silver Rate: లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..

ABN, Publish Date - Jun 14 , 2025 | 06:48 AM

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,950 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate

బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చేశాయి. వారం రోజుల క్రితం వరకు 97 వేల దగ్గర ట్రేడ్ అయిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర మళ్లీ లక్షకు చేరింది. బంగారం కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చింది. పేద, మధ్య తరగతి కుటుంబాలు బంగారం కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి తయారైంది. బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారు ప్రస్తుతం భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.

భాగ్య నగరంలో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,950 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,410 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,960 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 76,060 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు ఇలా ..

మే నెల మొదట్లో బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. మే నెల చివరికి వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. వెండి ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 12,010 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,20,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

30 రోజుల్లోనే ప్రీపెయిడ్‌-పోస్టు పెయిడ్‌ మార్పిడి

ఏలూరులో వేగ జ్యూయలర్స్‌ ప్రారంభం

Updated Date - Jun 14 , 2025 | 07:06 AM