ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold And Silver Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

ABN, Publish Date - Jul 05 , 2025 | 07:05 AM

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,730 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,500 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,050 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate

భారత స్త్రీలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత బంగారం ఉన్నా.. ఇంకా కావాలనే అంటారు. ఇక, శుభకార్యాల్లో కూడా బంగారం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. జనం పెట్టుబడులకు కూడా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోయాయి. నేడు మాత్రం బంగారం కొనాలనుకునే వారికి ఊరట లభించింది. బంగారం ధరలు తగ్గాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,730 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,500 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,050 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,720 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,490 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,050 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు..

మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత పెరుగుతూ పోయాయి. కానీ, ఈ రోజు వెండి ధరలు కూడా తగ్గాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 11,990 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,19,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఆస్తే లేనప్పుడు మనీలాండరింగ్‌ ఎక్కడిది?

పవర్‌ జోలికొస్తే... పవర్‌ పోతుంది

Updated Date - Jul 05 , 2025 | 07:07 AM