Gold and Silver Prices Today: నేటి బంగారం, వెండి ధరలు ఇవే.. ఎంత పెరిగాయంటే..
ABN, Publish Date - Feb 19 , 2025 | 07:03 AM
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సాధారణంగా బంగారం ధరపై ప్రభావం చూపుతుంటాయి. పసిడి రేటు పెరగడంతో పండగలు, వివాహాలు వంటి శుభకార్యాయాలకు గోల్డ్ కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
బిజినెస్ డెస్క్: కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గి ఊరట కలిగించినప్పటికీ గతేడాదితో పోలిస్తే ధరలు భారీగానే పెరిగాయి. పసిడి రేటు పెరగడంతో పండగలు, వివాహాలు వంటి శుభకార్యాయాలకు గోల్డ్ కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సాధారణంగా బంగారం ధరపై ప్రభావం చూపుతుంటాయి. కాగా, నేడు (19-02-2025) ఉదయం 06:30 గంటల సమయానికి బులియన్ మార్కెట్ (https://bullions.co.in/) ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,833 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.86,000గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.79,099కు చేరుకోగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,290 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక, వెండి విషయానికి వస్తే.. దేశరాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97,000గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ వెండి రూ.97,170కు చేరుకుంది. ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ.97,320 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఇవే..
ముంబై- రూ.78,971, రూ.86,150
చెన్నై- రూ.79,200, రూ.86,400
బెంగళూరు- రూ.79,035, రూ.86,220
కోల్‌కతా- రూ.78,870, రూ.86,040
పుణె- రూ.78,971, రూ.86,150
భోపాల్- రూ.79,053, రూ.86,240
భువనేశ్వర్- 78,989, రూ.86,170
కోయంబత్తూర్- రూ.79,200, రూ.86,400
జైపూర్- రూ.78,962, రూ.86,140
పట్నా- రూ.78,925, రూ.86,100
ఈ వార్తలు కూడా చదవండి:
ఎల్‌ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్
Updated Date - Feb 19 , 2025 | 07:27 AM