రూ.324 లక్షల కోట్లు
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:31 AM
గత ఏడాది (2024)కి గాను భారత్‌లోని అత్యంత విలువైన 500 ప్రభుత్వయేతర కంపెనీల జాబితా మంగళవారం విడుదలైంది. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపార విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా...
దేశంలోని టాప్- 500 కంపెనీల మార్కెట్ విలువ ఇది..
భారత జీడీపీ కంటే అధికం..
యూఏఈ, ఇండోనేషియా, స్పెయిన్ దేశాల మొత్తం జీడీపీ కన్నా ఎక్కువే..
జాబితాలో మళ్లీ రిలయన్సే టాప్
టీసీఎస్, హెచ్‌డీఎ్‌ఫసీకి 2, 3 స్థానాలు
టాప్ 10 కంపెనీల మొత్తం విలువ సౌదీ అరేబియా జీడీపీ కంటే ఎక్కువ..
అన్ లిస్టెడ్ కంపెనీల్లో ఎన్‌ఎ్‌సఈ నం.1
హైదరాబాద్ నుంచి 35 సంస్థలకు చోటు
బర్గండీ ప్రైవేట్ హురున్ జాబితా విడుదల
ముంబై: గత ఏడాది (2024)కి గాను భారత్‌లోని అత్యంత విలువైన 500 ప్రభుత్వయేతర కంపెనీల జాబితా మంగళవారం విడుదలైంది. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపార విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా దీన్ని విడుదల చేశాయి. భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.17.52 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువతో వరుసగా నాలుగోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాదిలో రిలయన్స్ మార్కెట్ సంపద 12 శాతం పెరిగిందని రిపోర్టు వెల్లడించింది. దేశీయ ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలైన టీసీఎ్‌స (రూ.16.10 లక్షల కోట్లు), హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ (రూ.14.22 లక్షల కోట్లు) వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఎయిర్‌టెల్ (రూ.9.74 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.9.30 లక్షల కోట్లు), ఇన్ఫోసి్‌స(రూ.7.99 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.5.80 లక్షల కోట్లు), ఎల్ అండ్ టీ(రూ.5.42 లక్షల కోట్లు), హెచ్‌సీఎల్ టెక్ (రూ.5.18 లక్షల కోట్లు), ఎన్‌ఎ్‌సఈ (రూ.4.70 లక్షల కోట్లు) వరుసగా టాప్-10లోని తర్వాత స్థానాలను దక్కించుకున్నాయి. జాబితాలోని 500 కంపెనీ ల మొత్తం మార్కెట్ సంపద గత ఏడాది 40 శాతం పెరిగి 3.8 లక్షల కోట్ల డాలర్లకు (రూ.324 లక్షల కోట్లు) చేరుకుంది.
భారత జీడీపీ (3.5 లక్షల కోట్ల డాలర్లు) కంటే అధికమిది. అంతేకాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇండోనేషియా, స్పెయిన్ దేశాల మొత్తం జీడీపీ కంటే కూడా ఎక్కువే. కాగా, దేశంలోని టాప్-500 కంపెనీలు మొత్తం 84 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తున్నాయి. 2023 లిస్ట్‌తో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 14 లక్షల మేర పెరిగింది. అంటే, ఒక్కో సంస్థలో సగటున 21,000 మంది పనిచేస్తున్నారు. నివేదికలోని మరిన్ని విషయాలు..
ప్రభుత్వ సంస్థల్లో ఎస్‌బీఐ టాప్
దేశంలోని అత్యంత విలువైన ప్రభుత్వ రంగ కంపెనీల విషయానికొస్తే, ఎస్‌బీఐ రూ.7.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో అగ్రస్థానంలో ఉంది. ఎల్‌ఐసీ (రూ.5.89 లక్షల కోట్లు), ఎన్‌టీపీసీ (రూ.3.46 లక్షల కోట్లు), ఓఎన్‌జీసీ (రూ.3.20 లక్షల కోట్లు), హిందుస్థాన్ ఎరోనాటిక్స్ (రూ.3.12 లక్షల కోట్లు) వరుసగా టాప్ 5లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, కోల్ ఇండియా, భారత్ ఎలకా్ట్రనిక్స్, ఐఆర్‌ఎ్‌ఫసీ, ఐఓసీ వరుసగా టాప్ 10లోని మిగతా స్థానాలను దక్కించుకున్నాయి.
ఈ జాబితాలోని టాప్-10 కంపెనీల మొత్తం మార్కెట్ విలువ గత ఏడాదిలో రూ.22.7 లక్షల కోట్లు వృద్ధి చెంది రూ.96 లక్షల కోట్లు దాటింది. సౌదీ అరేబియా జీడీపీ కంటే అధికమిది. అంతేకాదు, భారత జీడీపీలో దాదాపు మూడో వంతుకు సమానం. లిస్ట్‌లోని మొత్తం కంపెనీల మార్కెట్‌లో 30 శాతం వాటా వీటిదే.
టాప్ టెన్ కంపెనీల్లోకెల్లా ఎయిర్‌టెల్ విలువ అత్యధికంగా రూ.4 లక్షల కోట్లు పెరిగింది. పైగా ఎయిర్‌టెల్ టాప్-5లోకి చేరడం ఇదే తొలిసారి.
అత్యంత విలువైన 10 కంపెనీల్లో తొలిసారిగా చోటు దక్కించుకున్న ఏకైక అన్ లిస్టెడ్ కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ). అంతేకాదు, దేశంలో ఇదే అత్యంత విలువైన అన్ లిస్టెడ్ కంపెనీ కూడా. గత ఏడాది ఎన్‌ఎ్‌సఈ విలువ 201 శాతం వృద్ధి చెంది రూ.4.70 లక్షల కోట్లు దాటింది. ఇప్పటివరకు అన్‌లిస్టెడ్ కంపెనీల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ (రూ.2.11 లక్షల కోట్లు) ఈసారి రెండో స్థానానికి జారుకుంది. జోహో కార్ప్, జీరోధా, హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఈసారి జాబితాలోని సంస్థల మొత్తం మార్కెట్ విలువలో అన్‌లిస్టెడ్ కంపెనీల వాటా 22 శాతంగా ఉంది.
ఈసారి జాబితాలో అత్యధిక సంపద వృద్ధిని కనబరిచిన కంపెనీల్లో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 297 శాతం పెరుగుదలతో నం.1గా నిలిచింది. ఐనాక్స్ విండ్ (273 శాతం), జెప్టో (269 శాతం), డిక్సన్ టెక్నాలజీస్ (241 శాతం), ట్రెంట్ (228 శాతం) ఆ తర్వాత స్థానాలను దక్కించుకున్నాయి. కాగా, అన్ లిస్టెడ్ కంపెనీల్లో క్విక్ కామర్స్ కంపెనీ జెప్టోదే అగ్రస్థానం. ఎన్‌ఎ్‌సఈ, ఫిజిక్స్‌వాలా (172ు) టాప్-3లో నిలిచాయి.
ఈసారి లిస్ట్‌లో 82 కంపెనీలకు కొత్తగా స్థానం లభించింది. హైదరాబాద్‌కు చెందిన అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్, ప్రీమియర్ ఎనర్జీస్‌తో పాటు అదానీ రియల్టీ కూడా ఇందులో ఉన్నాయి.
కనీసం రూ.9,580 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీలను ఈసారి పరిగణనలోకి తీసుకున్నట్లు రిపోర్టు వెల్లడించింది. గతసారి పరిగణనలోకి తీసుకున్న విలువ రూ.6,700 కోట్లతో పోలిస్తే 43 శాతం ఎక్కువిది.
ఈ జాబితాలో కనీసం 3 సంవత్సరాల నుంచి ఏకంగా 192 ఏళ్ల ప్రస్థానం కలిగిన (పీఎన్‌జీ జువెలర్స్) కంపెనీలున్నాయి. 23 కంపెనీల వ్యాపార ప్రస్థానం 100 ఏళ్ల పైమాటే.
జాబితాలో అత్యధికంగా ముంబై నుంచి 154 కంపెనీలకు చోటు దక్కగా.. బెంగళూరు (44 కంపెనీలు), ఢిల్లీ (37), గురుగ్రామ్(36) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 35 కంపెనీలతో హైదరాబాద్ టాప్-5 నగరంగా నిలిచింది.
జాబితాలోని 500 కంపెనీల మొత్తం ఆదాయం లక్ష కోట్ల డాలర్లకు చేరగా.. రూ.8 లక్షల లాభాన్ని ఆర్జించాయి. రూ.2.2 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయని, కార్పొరేట్ల సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) కార్యక్రమాల కోసం రూ.11,000 కోట్లు వెచ్చించాయని నివేదిక వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
Unemployment Rate: దేశంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగితపై కీలక నివేదిక..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
TCS Salary Hike: మార్చిలో టీసీఎస్‌లో
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..