Indian Job Market: కొలువుల మార్కెట్‌పైనా ఉద్రిక్తతల ప్రభావం
ABN, Publish Date - Jun 23 , 2025 | 03:29 AM
భౌగోళిక ఉద్రిక్తల ప్రభావం మన దేశంలోని కొలువుల మార్కెట్‌పైనా కనిపిస్తోంది. కంపెనీలు నియామకాలకు ఏమాత్రం సాహసించడం లేదు. ఉన్న ఉద్యోగులతోనే నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
నియామకాలు పక్కన పెడుతున్న కంపెనీలు.. జీనియస్ కన్సల్టెంట్స్
ముంబై: భౌగోళిక ఉద్రిక్తల ప్రభావం మన దేశంలోని కొలువుల మార్కెట్‌పైనా కనిపిస్తోంది. కంపెనీలు నియామకాలకు ఏమాత్రం సాహసించడం లేదు. ఉన్న ఉద్యోగులతోనే నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కంపెనీలకు మానవ వనరుల సేవలు అందించే ‘జీనియస్ కన్సల్టెంట్స్’ అనే సంస్థ ఈ మేరకు ఒక సర్వే విడుదల చేసింది. గత నెల 12 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఈ సంస్థ ఇందుకోసం వివిధ రంగాలకు చెందిన 2,006 మంది ఉద్యోగులను ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసి ఈ సర్వేను విడుదల చేసింది. ఒక వేళ నియామకాలు తప్పనిసరైనా కంపెనీలు కొద్ది మందితో సరిపెడుతున్నాయి. కొన్ని కంపెనీలైతే కాంట్రాక్టు పద్దతిలో లేదా ఫ్రీలాన్స్ పద్దతిలో పనులు కానిచ్చేస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో 63 శాతం మంది తమ కంపెనీలు నియామకాలు పూర్తిగా పక్కన పెట్టడం లేదా తగ్గించాయని చెబితే 15 శాతం మంది మాత్రం తమ కంపెనీలు కాంట్రాక్టు ఉద్యోగులు లేదా ఫ్రీలాన్సింగ్ పద్దతిలో పనులు చేసే వారి వైపు మొగ్గు చూపుతున్నట్టు చెప్పారు.
Updated Date - Jun 23 , 2025 | 03:30 AM