జీఈ వెర్నోవా స్టీమ్‌తో ఆజాద్ ఇంజనీరింగ్ ఒప్పందం
ABN, Publish Date - May 05 , 2025 | 05:29 AM
అణు విద్యుత్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ఎయిర్‌ఫాయిల్స్ సరఫరా కోసం జీఈ వెర్నోవా స్టీమ్ పవర్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్‌తో ఒప్పందం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అణు విద్యుత్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ఎయిర్‌ఫాయిల్స్ సరఫరా కోసం జీఈ వెర్నోవా స్టీమ్ పవర్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్ ప్రకటించింది. దీని విలువ రూ.5.35 కోట్ల డాలర్లని (కూ.454.75 కోట్లు) వెల్లడించింది. 2030 వరకు అంటే ఆరేళ్ల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం కింద జీఈ వెర్నోవా తమ కోసం కాంప్లెక్స్ రొటేటింగ్, స్టేషనరీ ఎయిర్ ఫాయిల్స్ ఉత్పత్తి చేసి సరఫరా చేస్తుందని ఆజాద్ ఇంజనీరింగ్ సీఈఓ, చైర్మన్ రాకేశ్ చోప్దార్ తెలిపారు. ఇప్పటికే ఉభయ సంస్థల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News
Updated Date - May 05 , 2025 | 05:29 AM