ఎఫ్‌పీఐ పెట్టుబడి రూ.17,425 కోట్లు
ABN, Publish Date - Apr 28 , 2025 | 02:09 AM
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత వారంలో రూ.17,425 కోట్లు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశా రు. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో పాటు...
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత వారంలో రూ.17,425 కోట్లు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశా రు. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో పాటు స్థూల ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉండ డం ఇందుకు దోహదపడింది. అంతకు ముందు వారంలో కూడా వారు రూ.8,500 కోట్లు భారత ఈక్విటీల్లో పెట్టుబడిగా పెట్టారు. డిపాజిటరీల వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు రూ.5,678 కోట్లు ఉపసంహరించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు వారు తరలించుకుపోయిన నిధుల విలువ రూ.1.22 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచంలో వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను బలపరిచిందని పరిశీలకులంటున్నారు.
Read Also: Gold Rates Today: నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇవీ
జీవిత బీమా పాలసీదారులకు రైడర్లతో మరింత రక్షణ
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఏం కావాలంటే ?
Updated Date - Apr 28 , 2025 | 02:29 AM