FalconX CEO: ఫాల్కన్‌ఎక్స్ సీఈఓ రఘు యార్లగడ్డకు ఫిన్‌టెక్ ఎక్సలెన్స్ అవార్డు
ABN, Publish Date - Jul 06 , 2025 | 02:58 AM
అమెరికాకు చెందిన డిజిటల్ అసెట్ ట్రేడింగ్ సేవల కంపెనీ ఫాల్కన్‌ఎక్స్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ రఘు యార్లగడ్డకు తానా అవార్డు లభించింది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న తానా 24వ వార్షిక సదస్సులో...
హైదరాబాద్: అమెరికాకు చెందిన డిజిటల్ అసెట్ ట్రేడింగ్ సేవల కంపెనీ ఫాల్కన్‌ఎక్స్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ రఘు యార్లగడ్డకు తానా అవార్డు లభించింది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న తానా 24వ వార్షిక సదస్సులో రఘు యార్లగడ్డను ‘తానా అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ’ (ఫిన్‌టెక్) అవార్డుతో సత్కరించనుంది. ఈ జనవరిలో ఆయన యూటీ డల్లాస్ డిస్టింగ్విష్ట్ అలుమ్నీ అవార్డుకు కూడా ఎంపికయ్యారు. విజయవాడ వాస్తవ్యులైన రఘు యార్లగడ్డ.. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్-డల్లాస్ నుంచి సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంఎల్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎ్‌స) పట్టా పుచ్చుకున్నారు. ఆపై హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేసిన యార్లగడ్డ.. 2018లో కాలిఫోర్నియా కేంద్రంగా ఫాల్కన్‌ఎక్స్‌ను ప్రారంభించారు. ఇప్పటికే కంపెనీ మార్కెట్ విలువ 800 కోట్ల డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.68,500 కోట్లు) దాటింది.
ఇవి కూడా చదవండి
ఆస్తే లేనప్పుడు మనీలాండరింగ్ ఎక్కడిది?
పవర్ జోలికొస్తే... పవర్ పోతుంది
Updated Date - Jul 06 , 2025 | 02:58 AM