ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్రూడ్‌ డౌన్‌ మార్కెట్‌ అప్‌

ABN, Publish Date - May 06 , 2025 | 04:58 AM

ఈక్విటీ సూచీలు సోమవారం 4 నెలల గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 60 డాలర్ల కన్నా దిగి రావడం ఇందుకు దోహదపడింది. సెన్సెక్స్‌ ఒకదశలో...

  • 60 డాలర్ల దిగువకు ముడిచమురు

  • 295 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: ఈక్విటీ సూచీలు సోమవారం 4 నెలల గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 60 డాలర్ల కన్నా దిగి రావడం ఇందుకు దోహదపడింది. సెన్సెక్స్‌ ఒకదశలో 547.04 పాయింట్ల లాభంతో 81,049.03 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 294.85 పాయింట్ల వృద్ధితో 80,796.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 114.45 పాయింట్లు బలపడి 24,461.15 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో సూచీలకిదే గరిష్ఠ ముగింపు స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గడంతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు కొనసాగడం కూడా మార్కెట్‌ లాభాలకు దోహదపడింది.

ఆయిల్‌ షేర్లు హైజంప్‌ : ముడిచమురు ధరలు బాగా తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. హెచ్‌పీసీఎల్‌ 6.65 శాతం, ఐఓసీ 3.66 శాతం, బీపీసీఎల్‌ 3.25 శాతం పెరిగాయి. జూన్‌లో చమురు ఉత్పత్తిని మరింత పెంచనున్నట్లు సౌదీ అరేబియా నేతృత్వంలోని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్‌+) ప్రకటించడంతో క్రూడాయిల్‌ ధర 60 డాలర్ల కన్నా దిగువకు తగ్గింది.


అదానీ షేర్లు జూమ్‌

అదానీ గ్రీన్‌ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్‌ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులకు రూ.2,200 కోట్ల లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై గత ఏడాదిలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ సహా 8 మంది వ్యక్తులపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నేరారోపణలను రద్దు చేయాలంటూ అదానీ తరపున ప్రతినిధులు అమెరికా అధికారులను కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌ షేరు ఏకంగా 11.01 శాతం ఎగబాకగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 6.96 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 6.61 శాతం, అదానీ పోర్ట్స్‌ 6.29 శాతం, అదానీ పవర్‌ 5.96 శాతం పెరిగాయి. దాంతో గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.13.33 లక్షల కోట్లకు పెరిగింది.

  • ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసలు పెరిగి రూ.84.30 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో లాభాలతోపాటు ముడిచమురు ధరల తగ్గుదల ఇందుకు తోడ్పడ్డాయి.


షెల్‌ గూటికి బీపీ?

అంతర్జాతీయ ఇంధన రంగంలో త్వరలోనే మెగా డీల్‌ కుదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. బ్రిటిష్‌ ఇంధన దిగ్గజం బీపీ పీఎల్‌సీని కొనుగోలు చేసేందుకు బ్రిటన్‌కు చెందిన మరో ప్రముఖ ఆయిల్‌ కంపెనీ షెల్‌ పీఎల్‌సీ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. మార్కెట్లో ముడిచమురు ధరలతోపాటు బీపీ స్టాక్‌ మరింతగా తగ్గుముఖం పట్టాక టేకోవర్‌ చేయాలని షెల్‌ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్

ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..

వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్

Read More Business News and Latest Telugu News

Updated Date - May 06 , 2025 | 04:58 AM