Coromandel International: కోరమాండల్ గూటికి ఎన్‌ఏసీఎల్
ABN, Publish Date - Aug 09 , 2025 | 03:15 AM
నాగార్జునా గ్రూప్ కంపెనీ ఎన్‌ఏసీఎల్ ఇండస్ట్రీస్ యాజమాన్యం చేతులు మారింది. ఈ కంపెనీ ఈక్విటీలో
న్యూఢిల్లీ : నాగార్జునా గ్రూప్ కంపెనీ ఎన్‌ఏసీఎల్ ఇండస్ట్రీస్ యాజమాన్యం చేతులు మారింది. ఈ కంపెనీ ఈక్విటీలో 53 శాతం వాటా కొనుగోలు పూర్తి చేసినట్టు మురుగప్ప గ్రూప్ కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తెలిపింది. దీంతో ఎన్‌ఏసీఎల్ ఇండస్ట్రీస్ ఈక్విటీలో మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం, కోరమాండల్ ఇంటర్నేషనల్ త్వరలో ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. వ్యవసాయ క్రిమి సంహారక మందుల మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలన్న దీర్ఘకాలిక లక్ష్యానికి ఈ కొనుగోలు దోహదం చేస్తుందని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - Aug 09 , 2025 | 03:15 AM