ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Income Tax Bill 2025: ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును వెనక్కి తీసుకున్న కేంద్రం.. సోమవారం మరో కొత్త బిల్లు..

ABN, Publish Date - Aug 09 , 2025 | 07:23 AM

ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. మార్పు చేర్పులతో కూడిన కొత్త బిల్లును ఆగస్టు 11న మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

Central Government withdrawn Income Tax Bill 2025

ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును (Income Tax Bill 2025) కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. మార్పు చేర్పులతో కూడిన కొత్త బిల్లును ఆగస్టు 11న మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటన విడుదల చేసింది. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి కేంద్ర ప్రభుత్వం అనేక సవరణలు చూసి కొత్త బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరి 13న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

ఈ కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు-2025కు బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ పలు సవరణలు సూచించింది. ఆ సవరణలు చేసి రూపొందించిన కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు-2025ను కేంద్రం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. కమిటీ సూచించిన అన్ని మార్పులతో స్పష్టమైన, సరళమైన భాషతో కూడిన నవీకరించిన ఆదాయపు పన్ను బిల్లును సభ పరిశీలన కోసం ఆగస్టు 11న ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కొత్త బిల్లు పలు గందగోళాలకు తెర దించడమే కాకుండా కొన్ని సవరణలకు కూడా చోటు కల్పించబోతోందట.

ఇంటిపై ఆదాయం పొందుతున్న వారికి ఉపశమనం కలిగేలా ఈ కొత్త బిల్లులో పలు మార్పులు చేసినట్టు సమాచారం. గృహరుణ వడ్డీతో పన్ను మినహాయింపు ప్రస్తుతం సొంతింట్లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తోంది. ఈ కొత్త బిల్లు ప్రకారం సొంతింటిని అద్దెకు ఇచ్చిన వారికి కూడా వడ్డీతో పన్ను మినహాయింపు లభించనుందట. అలాగే టీడీఎస్, టీసీఎస్ రిఫండ్లను కూడా ఈ కొత్త బిల్లు ద్వారా సరళతరం చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 09 , 2025 | 07:23 AM