ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bank News: ఆ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా.. అయితే మీకు గుడ్‌న్యూస్..

ABN, Publish Date - Jun 02 , 2025 | 08:33 AM

Bank News: ఒకప్పుడు ఒక బ్యాంకులో అకౌంట్ ఉండటమే గగనంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రతీ ఒక్కరికి కనీసం రెండు బ్యాంకుల్లో అయినా అకౌంట్లు ఉంటున్నాయి. నాలుగు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారి సంఖ్య మన ఊహకు మించి ఉంటుంది.

Bank News

ఒకప్పుడు ఒక బ్యాంకులో అకౌంట్ ఉండటమే గగనంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రతీ ఒక్కరికి కనీసం రెండు బ్యాంకుల్లో అయినా అకౌంట్లు ఉంటున్నాయి. నాలుగు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారి సంఖ్య మన ఊహకు మించి ఉంటుంది. అయితే, బ్యాంకులో అకౌంట్లు ఉండటం ఒక ఎత్తయితే.. ఆ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ఉంచటం మరో ఎత్తు. అదే పెద్ద సవాల్. మనకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది.. ఏ ప్రాంతంలో ఉందన్న దాన్ని బట్టి మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది.


బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే.. పెనాల్టీ పడుతుంది. బ్యాంకును బట్టి పెనాల్టీ ఉంటుంది. ఖాతాదారులకు ఇదే పెద్ద తలనొప్పిగా తయారైంది. ఖాతాదారులను ఎంతో ఇబ్బందిపెడుతున్న మినిమం బ్యాలెన్స్ మెయిన్‌టెనెన్స్‌పై కెనరా బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుకు భారీ శుభవార్త చెప్పింది. మినిమం బ్యాలెన్స్ రిక్వైర్‌మెంట్‌ను తీసేసింది. జూన్ 1వ తేదీనుంచి సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.


ఇకపై కెనరా బ్యాంకులో అకౌంట్ ఉన్నవారు తమ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం. అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. మినిమం బ్యాలెన్స్ రిక్వైర్‌మెంట్‌ను తీసేసిన మొదటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా కెనరా బ్యాంకు చరిత్ర సృష్టించింది. గతంలో చూసుకుంటే నగరాల్లో ఖాతా ఉంటే.. 2 వేల రూపాయలు, పట్టణాల్లో ఖాతా ఉంటే వెయ్యి రూపాయలు, గ్రామాల్లో ఖాతా ఉంటే 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయిన్‌టేన్ చేయాల్సి ఉండేది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే 25 నుంచి 45 రూపాయల వరకు పెనాల్టీ పడేది. ఇప్పుడు ఖాతాలో డబ్బులు లేకపోయినా ఎలాంటి పెనాల్టీ పడదు.


ఇవి కూడా చదవండి

ఉదయం నిద్ర లేవగానే ఇది తాగితే చాలు.. దెబ్బకు రోగాలు మాయం..

ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారుల మృతి

Updated Date - Jun 02 , 2025 | 09:39 AM