ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gland Pharma Stake Sale: గ్లాండ్‌ ఫార్మా రేసులో బ్రూక్‌ఫీల్డ్‌ ఈక్యూటీ

ABN, Publish Date - Jul 22 , 2025 | 05:17 AM

దేశీయ ఫార్మా రంగంలో మరో భారీ డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే గ్లాండ్‌ ఫార్మా యాజమాన్యం మళ్లీ చేతులు మారే సూచనలు కనిపిస్తున్నాయి...

  • ఫోసన్‌ నుంచి 51.8% వాటా కొనుగోలుకు సన్నాహాలు

  • ప్రతిబంధకంగా కంపెనీ షేరు ధర

దేశీయ ఫార్మా రంగంలో మరో భారీ డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే గ్లాండ్‌ ఫార్మా యాజమాన్యం మళ్లీ చేతులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కంపెనీ ఈక్విటీలో 51.8 శాతం వాటా ఉన్న చైనా కంపెనీ ఫోసన్‌ గ్రూప్‌ తన వాటాను అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థలు బ్రూక్‌ఫీల్డ్‌, ఈటీక్యూ ఈ వాటా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. సీవీసీ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌, వార్‌బర్గ్‌ పింకస్‌ అనే పీఈ సంస్థలు కూడా త్వరలో ఈ వాటా కొనుగోలుకు ముందుకు వస్తాయని భావిస్తున్నారు.

ఫోసన్‌ వాటా విలువ రూ.30,000 కోట్లు

గ్లాండ్‌ ఫార్మా షేరు సోమవారం బీఎ్‌సఈలో స్వల్పలాభంతో రూ.2,012.15 వద్ద క్లోజైంది. గత నెల రోజుల్లోనే కంపెనీ షేరు ధర 16 శాతం పెరిగింది. ఈ లెక్కన గ్లాండ్‌ ఫార్మా ఈక్విటీలో చైనా కంపెనీ ఫోసన్‌కు ఉన్న 51.8 శాతం వాటా విలువ దాదాపు రూ.30,000 కోట్ల వరకు ఉంటుంది. దీంతో పాటు మైనారిటీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాను ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేయాలి. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం చూస్తే ఇందుకు ఎంత లేదన్నా మరో రూ.25,800 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంత భారీ మొత్తం పెట్టేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు వెనుకాడుతున్నట్లు సమాచారం. దీంతో ఈ అమ్మకం ఎంత వరకు ముందుకు కదులుతుందన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది.

1978లో ఏర్పాటు: గ్లాండ్‌ ఫార్మాను 1978లో పీవీఎన్‌ రాజు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు పద్దతిలో ఇంజెక్టబుల్స్‌, కొత్త ఔషధాల అభివృద్ధి, తయారీ (సీడీఎంఓ)లో కంపెనీకి మంచి పట్టుంది. 2016లో చైనా కంపెనీ ఫోసన్‌ గ్రూప్‌..గ్లాండ్‌ ఫార్మా ఈక్విటీలో 86 శాతం వాటాను మరో పీఈ సంస్థ కేకేఆర్‌ నుంచి 126 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. గల్వాన్‌ సరిహద్దు ఘర్షణ తర్వాత కేంద్రం చైనా కంపెనీలపై పట్టు బిగిస్తోంది. అప్పటి నుంచి చైనా కంపెనీ ఓపెన్‌ మార్కెట్లో షేర్లు విక్రయించడం ద్వారా ప్రస్తుతం తన వాటాను 51.8 శాతానికి కుదించుకుంది. ఈ వాటాను కూడా ఏవైనా పీఈ సంస్థలకు విక్రయించి గ్లాండ్‌ ఫార్మా నుంచి పూర్తిగా తప్పుకోవాలని ఫోసన్‌ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 05:17 AM