Mid Size SUV: రూ.15 లక్షల లోపు టాప్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే
ABN, Publish Date - Jun 09 , 2025 | 09:08 PM
మిడ్ సైజ్ ఎస్‌యూవీ కొనాలనుకుంటున్నారా? రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల బడ్జెట్ ఉందా? అయితే, ఈ రేంజ్‌లో ఉన్న అద్భుతమై కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో మిడ్ సైజ్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ సెగ్మెంట్‌లో కార్లు అందుబాటు ధరల్లో ఉండటంతో జనాల ఆసక్తి పెరిగింది. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య పలు బ్రాండ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ రేంజ్‌లో టాప్ కార్లు ఏవో తెలుసుకుందాం.
ఈ ధరకు మంచి ఫీచర్స్‌తో వచ్చే మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో హ్యుండాయ్ క్రెటా ముఖ్యమైనది. పూర్తి ఎల్‌ఈడీ సెటప్‌తో ఆకర్షణీయంగా కనిపించే డిజైన్‌తో వచ్చే ఈ కారు ప్రారంభ ధర రూ.11 లక్షలు. నగర రోడ్లతో పాటు హైవేలపై దూసుకుపోయేందుకు ఇది అనువైన కారు. 115 పీఎస్, 144 ఎన్‌ఎమ్ టార్క్‌తో 1.5 లిటర్ పెట్రోల్ ఇంజెన్, 1.4 లీటర్ టర్బో చార్జ్ ఇంజెన్, 140 పీఎస్, 242 ఎన్ఎమ్ టార్క్ 1.5 లీటర్ డిజిల్ ఇంజెన్ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది.
కియా సెల్టోస్ ప్రారంభ ధర రూ.11.13 లక్షలు. ఫ్యూచరిస్టిక్ డిజైన్, అద్భుతమైన మైలేజీ, డ్రైవింగ్ అనుభవానికి ఇది పెట్టింది పేరు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజెన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజెన్, 1.4 లీటర్ టర్బో చార్జ్‌డ్ యూనిట్ వేరియంట్‌లలో ఈ కారు అందుబాటులో ఉంది.
ఆఫ్ రోడింగ్ ఇష్టపడేవారికి మహీంద్రా థార్ రాక్స్ అనువైనదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. దీని ప్రారంభ ధర రూ.12.99 లక్షలు. టాప్ మోడల్ ధర గరిష్ఠంగా రూ.23 లక్షలు.
అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతీ బ్రాండ్ కార్లలో బ్రెజా ఒకటి. అద్భుతమైన మైలేజీ, కారు లోపల బోలెడంత జాగా ఉండటం ఈ కారు ప్రత్యేకతలు. ఈ కారు ప్రారంభ దర రూ.8.69 లక్షలు. టాప్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.14.14 లక్షలు. వీటితో పాటు మారుతీ గ్రాండ్ విటారా, ఎమ్‌జీ ఆస్టార్, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, స్కోడా కుషాక్, ఫోక్స్‌వాగన్ టైగన్‌లకు కూడా మంచి ఆదారణ ఉంది. మరి మీ బడ్జెట్‌కు తగిన కారును ఎంచుకుని రయ్యిమని దూసుకెళ్లిపోండి.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్టార్‌లింక్‌కు త్వరలో లైసెన్స్.. మంత్రి జ్యో్తిరాదిత్య సింధియా ప్రకటన
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 10 , 2025 | 08:40 AM