Starlink Licence: స్టార్‌లింక్‌కు త్వరలో లైసెన్స్.. మంత్రి జ్యో్తిరాదిత్య సింధియా ప్రకటన
ABN , Publish Date - Jun 03 , 2025 | 09:50 PM
భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్‌కు త్వరలోనే అనుమతులు జారీ అవుతాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్‌లింక్‌కు భారత్‌లో కార్యకలాపాల కోసం లైసెన్స్ దాదాపుగా వచ్చినట్టే అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. టెలీకమ్యూనికేషన్స్ శాఖ స్టార్ లింక్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిందని కూడా తెలిపారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథొరైజేషన్ సెంటర్ తుది అనుమతులు జారీ చేయాల్సి ఉందని వెల్లడించారు.
‘ప్రస్తుతం శాటిలైట్ కనెక్టివిటీ కోసం వన్ వెబ్, రిలయన్స్ సంస్థలకు అనుమతులు ఉన్నాయి. స్టార్‌లింక్‌కు అనుమతుల జారీ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయ్యింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా జారీ అయ్యింది. త్వరలోనే లైసెన్స్ జారీ అవుతుందని అనుకుంటున్నాను’ అని మంత్రి తెలిపారు. ‘తదుపరి దశలో ఇన్-స్పేస్ నుంచి అనుమతులు రావాలి. కార్యకలాపాలు ప్రారంభించేందుకు మూడు సంస్థలకూ ఇది తప్పనిసరి’ అని చెప్పారు.
సర్వీసును పరీక్షించే నిమిత్తం వన్‌వెబ్, రిలయన్స్‌కు మిలిమల్ ఎక్స్‌ప్లొరేటరీ బేసిస్ ప్రాతిపదికన స్పెక్ట్రమ్ కేటాయింపు జరిగిందని చెప్పారు. స్టార్‌లింక్ కూడా ఇదే పంథా అనుసరిస్తుందని చెప్పారు. ‘ఆ తరువాత కమర్షియల్ కార్యకలాపాల కోసం స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన విధి విధానాలను ట్రాయ్ జారీ చేస్తుంది’ అని వివరించారు.
సుదూర ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, టవర్ల ఏర్పాటు కుదరదని చెప్పారు. ఇలాంటి ప్రాంతాలు భారత్‌లో అనేకం ఉన్నాయని చెప్పారు. వినియెగదారులకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండేలా చూడటం ఆ శాఖ మంత్రిగా తన బాధ్యత అని అన్నారు. తమకు నచ్చినది ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు ఉండాలని అన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్‌కు భారత్ నెట్ 2.0 ప్రోగ్రామ్ తోడయ్యి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌పై కూడా మంత్రి స్పందించారు. ‘మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే అంతరించిపోయారు’ అని తెలిపారు.
ఇవీ చదవండి:
భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి