BOI: బీవోఐ శుభవార్త.. గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు
ABN, Publish Date - Apr 16 , 2025 | 11:24 PM
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. గృహ రుణ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి కొత్త, పాత కస్టమర్లకు ఊరట కల్పించింది.
ముంబయి: దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. గృహ రుణ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి కొత్త, పాత కస్టమర్లకు ఊరట కల్పించింది. ఈ మార్పుతో, సిబిల్ స్కోర్ ఆధారంగా గృహ రుణ వడ్డీ సంవత్సరానికి 8.10% నుంచి 7.90%కి చేరింది. ఇంటి కలను సులభతరం చేయడం, కస్టమర్ల ఆర్థిక ఆకాంక్షలకు తోడ్పడేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. కొత్త రేట్లు 2025 ఏప్రిల్ 15 నుంచి అమలవుతాయి. గృహ రుణాలతోపాటు, వాహన రుణం, వ్యక్తిగత రుణం, ఆస్తి ఆధారిత రుణం, విద్యా రుణం, స్టార్ రివర్స్ మార్ట్‌గేజ్ రుణం వంటి కొన్ని రిటైల్ రుణాలపై కూడా బ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు ప్రకటించింది. అనుకూల ఆర్థిక పరిస్థితులను కస్టమర్లకు అందించడం, సరసమైన, స్నేహపూర్వక రుణ ఎంపికలను కొనసాగించింది.
పైసోం కా కదర్ పేరుతో ప్రచారం..
భీమ్(BHIM) తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ‘పైసోం కా కదర్’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుబంధ సంస్థ ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NBCL) ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. చెల్లింపు విధానాలు మారుతున్నప్పటికీ, భారతీయులు నగదుకు ఇచ్చే విలువను ఈ ప్రచారం ప్రతిబింబిస్తుంది. రోజువారీ చెల్లింపు అవసరాలను సులభంగా తీర్చే ఆధునిక యాప్‌గా భీమ్ స్థిరపడేలా ఈ కార్యక్రమం ఉంటుందని సంస్థ తెలిపింది.
Updated Date - Apr 16 , 2025 | 11:24 PM