స్వల్పంగా తగ్గిన అరబిందో ఫార్మా లాభం
ABN, Publish Date - May 27 , 2025 | 02:52 AM
అరబిందో ఫార్మా లాభాలు మార్చి త్రైమాసికంలో స్వ ల్పంగా తగ్గాయి. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.907 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ప్రకటించిన...
న్యూఢిల్లీ: అరబిందో ఫార్మా లాభాలు మార్చి త్రైమాసికంలో స్వ ల్పంగా తగ్గాయి. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.907 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ప్రకటించిన ఈ కంపెనీ ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.903 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అయితే ఇదే సమయంలో కంపెనీ ఆదాయం మాత్రం రూ.7,580 కోట్ల నుంచి రూ.8,382 కోట్లకు చేరింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.3,484 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.29,002 కోట్ల నుంచి రూ.31,724 కోట్లకు పెరిగింది. అమ్మకాలు, స్థూల లాభంపరంగా చూస్తే ఇది తమకు అత్యుత్తమ త్రైమాసికమని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 27 , 2025 | 02:52 AM