ఇంధన విక్రయం కోసం అంబానీతో అదానీ జట్టు
ABN, Publish Date - Jun 26 , 2025 | 05:46 AM
భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య మరో భాగస్వామ్యం కుదిరింది. వాహన ఇంధన విక్రయం కోసం అంబానీకి చెందిన జియో-బీపీతో అదానీకి చెందిన అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్...
ఇకపై జియో పెట్రోల్ బంకుల్లో అదానీ సీఎన్‌జీ...
అదానీ సీఎన్‌జీ కేంద్రాల్లో జియో ఇంధనం లభ్యం
న్యూఢిల్లీ: భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య మరో భాగస్వామ్యం కుదిరింది. వాహన ఇంధన విక్రయం కోసం అంబానీకి చెందిన జియో-బీపీతో అదానీకి చెందిన అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా అదానీ టోటల్ గ్యాస్‌కు చెంది న సీఎన్‌జీ విక్రయ కేంద్రాల్లో జియో-బీపీకి చెందిన పెట్రోల్, డీజిల్‌ను సైతం విక్రయించనున్నారు. అలాగే, జియో-బీపీ బంకుల్లో అదానీ టోటల్ గ్యాస్‌కు చెందిన సీఎన్‌జీ కూడా అందుబాటులోకి రానుంది. ఇరువర్గాలకు చెందిన ప్రస్తుత బంకులతో పాటు భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే వాటికీ ఈ భాగస్వామ్యం వర్తిస్తుందని బుధవారం సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి. బ్రిటన్ ఇంధన దిగ్గజం బీపీ పీఎల్‌సీ భాగస్వామ్యంలో ఏర్పాటైన జియో-బీపీ దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది. అదానీ గ్రూప్, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ భాగస్వామ్యంలో ఏర్పాటైన అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ 34 నగరాల్లో మొత్తం 650 సీఎన్‌జీ విక్రయ కేంద్రాలను కలిగి ఉంది. గడిచిన కొన్నినెలల్లో అంబానీ, అదానీ కంపెనీల మధ్య కుదిరిన రెండో వ్యాపార భాగస్వామ్యం ఇది. గత ఏడాది మార్చిలో అంబానీకి చెందిన రిలయన్స్.. మధ్యప్రదేశ్‌లో అదానీ పవర్‌కు చెందిన విద్యుత్ ప్రాజెక్టులో 26 శాతం వాటా దక్కించుకుంది. ఆ ప్లాంటులో ఉత్పత్తి చేసే 500 మెగావాట్ల విద్యుత్‌ను రిలయన్స్ తన పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకోనుంది.
ఇవీ చదవండి:
1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 26 , 2025 | 05:46 AM